డెన్మార్క్: ఫేస్‌బుక్ సెక్స్ వీడియో వివాదం.. వెయ్యి మందిపై కేసు

  • 16 జనవరి 2018
మొబైల్ ఫోన్లో టైప్ చేస్తున్న యువతి Image copyright Getty Images

అభ్యంతరకరమైన లైంగిక దృశ్యాలున్న వీడియోను షేర్ చేశారన్న అభియోగంపై డెన్మార్క్‌లో వెయ్యి మంది యువతపై పోలీసులు కేసు నమోదు చేశారు.

15 ఏళ్ల వారు సెక్స్‌లో పాల్గొన్న అసభ్యకరమైన దృశ్యాలను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా షేర్ చేశారని వీరిపై నిందారోపణ చేశారు.

చిన్నారుల అసభ్య చిత్రాలను పంపిణీ చేయటం నేరం. దృశ్యాల్లో ఉన్న ఇద్దరూ 18 ఏళ్లలోపు వారే కావటంతో ఈ వ్యవహారం చిన్నారుల అసభ్య చిత్రాలను పంపిణీ చేయటం కిందే పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

అమెరికా సంస్థల సమాచారంతో స్పందించిన ఫేస్‌బుక్.. ఈ విషయాన్ని డెన్మార్క్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.

దేశవ్యాప్తంగా 1004 మంది యువత.. గతేడాది సెప్టెంబర్-నవంబర్ నెలల మధ్య మెసెజింగ్ యాప్ ద్వారా ఈ వీడియోను సర్క్యులేట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వీరిలో కొందరు 18 ఏళ్లలోపువారు కాగా, మరికొందరు 18 ఏళ్లకు పైబడినవారు. మేజర్లందరినీ పోలీసు స్టేషన్‌కు పిలిపించగా.. మైనర్లందరినీ వాళ్ల తల్లిదండ్రుల ద్వారా సంప్రదించారు.

సెక్స్ వీడియోలను షేర్ చేయొద్దని ఈ కేసు ద్వారా యువతకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు డెన్మార్క్ పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల అభియోగాలు రుజువైతే నిందితులకు 20 రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

చిన్నారుల అసభ్య చిత్రాలను పంపిణీ చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. నిందితులను పదేళ్లపాటు చైల్డ్ పోర్నోగ్రఫీ నేరస్తుల జాబితాలో చేరుస్తారు.

‘రివెంజ్ పోర్న్’ను నిరోధించాలని డెన్మార్క్‌లో చాలామంది పిలుపునిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు