ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన టాటూ పార్లర్ ఇదేనా!?

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన టాటూ పార్లర్ ఇదేనా!?

జెరూసలెంలో ఓ చిన్న కుటుంబం నడిపిస్తున్న టాటూ పార్లర్ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్నారు.

25 తరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి దాదాపు 700 ఏళ్ళ చరిత్ర ఉందంటున్నారు. ఈ సాంప్రదాయిక కళారూపాన్ని తమ కుటుంబం ఒక బాధ్యతగా పరిరక్షిస్తోందని అంటున్నారు ఈజిప్ట్ క్రైస్తవుడైన వాసిమ్ రజాక్.

"500 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా పూర్వీకులది ఈజిప్టు. అప్పట్లో మా పూర్వీకుడు ఈజిప్టు నుంచి సందర్శకుడిగా జెరూసలెం వచ్చి.. టాటూలు వేస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఆ వృత్తిని మా కుటుంబం అలాగే కొనసాగిస్తూ వస్తోంది" ఆయన వివరించారు.

ఈ పార్లర్‌లో చెక్కతో చేసిన ఈ టాటూ అచ్చుల్లో కొన్ని శతాబ్దాల నాటివి కూడా ఉన్నాయి.

టాటూ అంటే ఆసక్తి లేని వాళ్ళు కూడా ఈ పార్లర్ ఘన చరిత్ర తెలిసిన తరువాత ఒక జ్ఞాపకాన్ని వెంట తీసుకువెళ్ళాలని భావిస్తున్నారు.

టాటూ వేయించుకోవడానికి ఇంతకన్నా గొప్ప చోటు ఇంకేం ఉంటుందని అంటున్నారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)