ఆలు చిప్స్‌పై 76 శాతం పన్ను.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు

  • 26 జనవరి 2018
చిప్స్

చిప్స్ దిగుమతిపై ఐస్‌లాండ్ ప్రభుత్వం 76 శాతం పన్ను విధించడాన్ని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

ఆలు చిప్స్‌పై భారీగా సుంకాలు విధించడం రాజ్యాంగంలోని సమానత్వ భావన అనే ప్రాథమిక నిబంధనలకు విరుద్ధమని దేశంలోని రెండు ప్రధాన ఫుడ్ కంపెనీలు ఇన్నెస్, హగెర్ వాదించాయి.

ప్రభుత్వం విధించిన అధిక పన్నులను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించాయి. అయితే వాటి వాదనను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది అని రికియవిక్ గ్రేప్విన్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఐస్‌లాండ్ జాతీయ మీడియా ఆర్‌యూవీ కథనం ప్రకారం.. ఇప్పటికే పన్ను చెల్లించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ అధికస్థాయిలో సుంకాలు విధించడాన్ని సవాలు చేస్తూ రెండు ఫుడ్ కంపెనీలు 6 కోట్ల 20 లక్షల రూపాయిల నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాయి.

కెనడా, పెరూ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగాళాదుంపలపై సుంకాలు 46 శాతం మించరాదని అవి వాదించాయి.

అయితే వాటి వాదనలు విన్న న్యాయమూర్తి పన్ను పెంపు అనేది ప్రభుత్వం, అధికారుల బాధ్యత అని, రాజ్యాంగపరిధిలో దాన్ని నిర్ణయించాలని ఏమీ లేదని తీర్పునిచ్చారు.

అంతేకాదు, చిప్స్ కేసులో వాదించడానికి ప్రభుత్వానికి అయిన ఖర్చును కూడా ఫుడ్ కంపెనీలే భరించాలని తీర్పునిచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)