కూడు..గూడు.. అందుబాటులో వైద్యం.. చాలు మాకు!

కూడు..గూడు.. అందుబాటులో వైద్యం.. చాలు మాకు!

‘‘మంచి రోజులు వస్తాయని మోదీ అన్నారు. మేమూ వేచి చూస్తున్నాం. కానీ మోదీ చెప్పిన ఆ మంచి రోజులు ఇంకా రాలేదు. ఎప్పుడొస్తాయో చూడాలి..!’’ అంటారు షెహజాద్.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈ సంధర్భంగా పలు రంగాలకు చెందిన వారిని 'బీబీసీ' పలకరించింది. రానున్న బడ్జెట్‌లో వారికేం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అందులో భాగంగా.. క్షౌర వృత్తిపై ఆధారపడి జీవిస్తోన్న షెహ్‌జాద్ అలీ పైన పేర్కొన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘అచ్ఛే దిన్’’ వస్తాయంటూ మోదీ చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా.. తన జీవితం మాత్రం మారలేదని, అప్పుడూ ఇప్పుడూ కూడా తాను అద్దె ఇంటికే పరిమితమయ్యానని అంటున్నారు.

ఉండడానికి ఇల్లు.. తినడానికి తిండి.. ప్రాణాలు నిలుపుకునేందుకు అందుబాటులో వైద్యం.. అది కూడా తమ బడ్జెట్‌లో.. అంటూ 2018 బడ్జెట్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఈ యువకుడు ఇంకా ఏం చెబుతున్నాడో చూడండి..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)