ఉభయ కొరియాల సరిహద్దు గ్రామ ప్రజల జీవితం ఎలా ఉంటుంది?

ఉభయ కొరియాల సరిహద్దు గ్రామ ప్రజల జీవితం ఎలా ఉంటుంది?

ఖాళీ రహదారులు, తీవ్రమైన చలి, రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా, అంతులేని సొరంగాలు... దక్షిణ కొరియా రాజధాని సోల్ నుండి ఉత్తర కొరియా సరిహద్దు వెంబడి ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడం అంత సులువు కాదు.

ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దు. ఒక రకమైన నిశ్శబ్దం ఈ గ్రామంలో కనిపిస్తుంది.

కొరియా ద్వీపకల్ప హింసాత్మక విభజన చూసిన ప్రజలు ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ భయంతో వణికిపోతారు. తొంబయ్యేళ్ల లీ సన్ జా అప్పటి హింసకు ప్రత్యక్ష సాక్షి.

దక్షిణ కొరియా లోని చుంచియాన్- సరిహద్దు దగ్గర ఉన్న చివరి పట్టణం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉన్నా ప్రతి ఏటా వచ్చే చేపల పండుగ ఘనంగా జరుపుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే యుద్ధం లాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తితే సురక్షితంగా ఎక్కడ తలదాచుకోవాలో ఇక్కడి వారికి బాగా తెలుసు.

ప్రస్తుతం సరిహద్దులో ఐదు లక్షలకు పైగా సైనికులను మోహరించింది దక్షిణ కొరియా. సరిహద్దుకు అటువైపు కూడా తుపాకులు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంది ఉత్తర కొరియా సైన్యం.

ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మాత్రం ఇక్కడినుండి తరలి పోయేదిలేదని తేల్చి చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)