#BudgetWithBBC: ఎక్కడా ‘అచ్ఛే దిన్’ !?
‘‘మంచి రోజులు వస్తాయని మోదీ అన్నారు. కానీ ఇవి భయంకరమైన రోజులు’’ అని చెబుతున్నారు అంజలి.
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా పలు రంగాలకు చెందిన వారిని 'బీబీసీ' పలకరించింది. రానున్న బడ్జెట్లో వారికేం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
అంజలి ఓ విద్యార్థిని.. తన భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన చెందుతున్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం సహకారం అందించాలని ఆమె కోరుతున్నారు.
మరోవైపు.. ఉదయం ఏ వార్తాపత్రిక చూసినా.. ఎక్కడో ఒక చోట ముస్లింలపై దాడులు, మహిళలపై అత్యాచారాలే ప్రధాన వార్తలుగా కనిపిస్తున్నాయని ఆమె ఆందోళనగా చెబుతున్నారు.
నాలుగేళ్ల మోదీ పాలనలో తనకు అచ్ఛేదిన్ కనిపించలేదని, రోజులు మరీ భయంకరంగా ఉన్నాయని ఆమె బీబీసీతో అన్నారు.
ప్రజాస్వామ్యం గురించి, మోదీ పాలన గురించి.. ‘2018 బడ్జెట్’ నేపథ్యంలో యువత అభిప్రాయాలను ఓసారి పరిశీలిద్దాం రండి!
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)