అంటార్కిటికా సముద్రం అడుగున రహస్యాలు ఇవే
అంటార్కిటికా- మానవాళికి దూరంగా హిమనీ నదాలు, మంచు పర్వతాలతో నిండిపోయిన ఖండం. అక్కడి పర్యావరణ, జీవావరణ వ్యవస్థ గురించి తేకుసుకోవడానికి చాలానే ఉంది.
చుట్టూ ఉన్న మంచుతో నిండిపోయిన సముద్రం కూడా అద్భుతమైన జీవ రహస్యాలను తన గుండెల్లో దాచుకుంది.
ఆ రహస్యాలను ఛేదించేందుకు మనిషి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఇపుడు మెషిన్ల సహాయంతో ఆ దారిలో వడివడిగా అడుగులు ముందుకేస్తున్నాడు.
ఒక చిన్న జలాంతర్గామిలో సముద్ర జీవశాస్త్రవేత్త డాక్టర్ సుసానే లఖార్డ్ ఇక్కడి సాగరం లోతుల్లోని జీవావరణ వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి వెళ్లారు.
సముద్రపు ఉపరితలం మీద అత్యంత శీతలమైన మంచు గడ్డ ఉంది. అదే సముద్రపు కింది భాగాన రోజురోజుకు అభివృద్ధి చెందుతోన్న జీవావరణ వ్యవస్థ. ఎండ కూడా ఇక్కడికి చేరుకోలేదు, అటువంటి చోట మొక్కలు పెరుగుతున్నాయి.
1,000 అడుగుల లోతులో రకరకాల జీవ జాతులు.. పగడాలు.. స్టార్ ఫిష్ లు.. వంటి ప్రాణులు ఇక్కడి చిమ్మ చీకటి లో జీవిస్తున్నట్టు గుర్తించారు.
ఇవి కూడా చూడండి:
- సముద్రం అట్టడుగున ఏం జరుగుతోందో తెలుసా!!
- చెత్త చూసి ఉంటారు, చెత్త సముద్రాన్ని ఎపుడైనా చూశారా!
- 360 వీడియో: పెంగ్విన్ పక్షుల నడుమ హాయిగా..
- ఎర్ర పీతలు: ఇవి చూడ్డానికే..
- నిజమెంత: ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- జైనబ్ పాకిస్తాన్ 'నిర్భయ' అవుతుందా?
- మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- వాట్సాప్లో ఈ మార్పులు వస్తున్నాయ్!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)