వీడియో: కాబూల్‌లో అంబులెన్స్ బాంబుతో తాలిబన్ల దాడి.. 100 మంది మృతి

  • 27 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వారం రోజుల్లో ఇది రెండో పెద్ద దాడి

ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 100 మంది చనిపోగా, మరో 191 మంది గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు.

ఒక అంబులెన్సులో పేలుడు పదార్థాలను నింపి, దానిని.. సాధారణ ప్రజలు వెళ్లేందుకు అవకాశం లేని ఒక వీధిలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుకు సమీపంగా తీసుకెళ్లి పేల్చటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

యురోపియన్ యూనియన్, హై పీస్ కౌన్సిల్ కార్యాలయాలకు సమీపంలోనే ఈ పేలుడు జరిగింది.

ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు.

గత వారమే కాబూల్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లోకి తాలిబన్ మిలిటెంట్లు చొరబడి 22 మందిని హతమార్చారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక దాడి జరిగిన ప్రాంతంలో ధ్వంసమైన వాహనాలు, భవనాలు
Image copyright BBC Afghan
చిత్రం శీర్షిక కాబూల్ నగరంలోని పలు వీధుల్లోని ప్రజలు పేలుడు కారణంగా ఏర్పడ్డ పొగను చూశారు
Image copyright WAKIL KOHSAR
చిత్రం శీర్షిక అంబులెన్స్ బాంబుదాడిలో గాయపడ్డ బాధితులకు ఒక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న దృశ్యం

స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో విదేశీ రాయబార కార్యాలయాలు, నగర పోలీసు హెడ్ క్వార్టర్స్‌ ఉన్నాయని, ఆ సమయంలో చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు.

ఆఫ్గానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో, పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరుడుగట్టిన ఇస్లామిక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న తాలిబన్లకు గట్టి పట్టు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు