మీ మైండ్‌ని రీఛార్జి చేయడానికి ఐదు మార్గాలు

తలపై బల్బుతో బాలిక

కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలనుకుంటున్నారా?

కొత్త సంవత్సర, సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అందిపుచ్చుకునేందుకు చాలామంది జనవరి నెలలోనే ప్రయత్నిస్తుంటారు.

ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందాలంటే.. శారీరక ఆరోగ్యం గురించే కాకుండా మానసిక ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలని ఇస్టాగ్రామ్‌లో #GirlGainsగా ప్రాచుర్యం పొందిన పర్సనల్ ట్రెయినర్లు టాలీ, జన్నా, విక్‌లు సూచిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

పర్సనల్ ట్రెయినర్లు టాలీ, జన్నా, విక్‌

2018లో మీ మైండ్‌ను సూపర్ ఛార్జ్ చేసుకోవటానికి వాళ్లిచ్చిన టాప్ 5 సలహాలు ఇవి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాటనుకుంటే బీబీసీ రేడియో 5 సరికొత్తగా ప్రారంభించిన పాడ్‌కాస్ట్‌ ‘ఫిట్ అండ్ ఫియర్‌లెస్’ను వినండి.

1) రాత్రిళ్లు మంచి నిద్ర

మీ మైండ్ సూపర్ ఛార్జ్ కావాలంటే రాత్రిపూట విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతి రాత్రి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ప్రతిరోజూ మీరు చాలా బాగా గడపగలుగుతారు.

2) మెదడుకు మేత

ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, భిన్న రకాల పండ్లు, కూరగాయలతో నిండిన ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ప్రతిరోజూ మీ మెదడుకు సరైన పోషణ అందుతుంది.

3) ప్రకృతితో గడపండి

వీలైనంత ఎక్కువగా పచ్చదనంతో ఉండండి. అలా చేస్తే.. పచ్చని చెట్లమధ్య గడపటంతో పాటు చక్కటి గాలి కూడా పీల్చుకోవచ్చు.

4) టెక్నాలజీని దూరం పెట్టండి

స్మార్ట్‌ఫోన్లు, చౌకగా లభిస్తున్న ఇంటర్నెట్ కారణంగా ఇప్పుడు చాలామంది రోజులో ఎక్కువ సమయం డిజిటల్ ప్రపంచంలోనే గడిపేస్తున్నారు. అయితే, తరచుగా డిజిటల్ ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవటం చాలా ముఖ్యం. ఫోన్లు, కంప్యూటర్లు, సోషల్ మీడియాకు దూరంగా కొంత సమయం గడిపేలా చూసుకోవాలి. వీలైతే.. వారంలో ఒక రోజును పూర్తిగా డిజిటల్ ప్రపంచానికి దూరంగా గడిపేలా చూడండి.

5) కృతజ్ఞతా భావనను పెంచుకోండి

కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవటాన్ని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయండి. నిద్రపోయే ముందు.. ఆ రోజు మొత్తంలో మూడు కృతజ్ఞతాపూర్వక విషయాలను జ్ఞాపకం చేసుకుని, వాటిలో ఒక దానిని తర్వాతి రోజు మరింతగా మెరుగుపర్చటం ఎలాగో చూడండి. అచ్చ తెలుగులో చెప్పాలంటే.. ఉపకార స్మరణ చేసి.. పరోపకార ప్రయత్నాలను పెంపొందించుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)