ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన గొరిల్లా మృతి

గొరిల్లా

ఫొటో సోర్స్, San Diego Zoo Safari Park/ Facebook

ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన గొరిల్లాల్లో ఒకటైన విలా మృతి చెందింది. దాని వయసు 60 ఏళ్లు.

కాంగోలో 1957లో జన్మించిన ఈ గొరిల్లా దాని కుటుంబ సభ్యుల సమక్షంలోనే చనిపోయిందని శాన్ డియాగో సఫారీ పార్కు శుక్రవారం ప్రకటించింది.

ఐదు తరాలకు అదే కుటుంబ పెద్ద అని పార్కు అధికారులు తెలిపారు.

‘‘ఈ వయసుకు దరిదాపులో ఉన్న గొరిల్లాలు చాలా తక్కువ’’ అని కాలిఫోర్నియాలోని సఫారీ పార్కు జంతు సంరక్షకుడు పెగ్గీ సెక్సటాన్ చెప్పారు.

గొరిల్లాలు సహజంగా 35 నుంచి 40 ఏళ్లు జీవిస్తాయి.

ఫొటో సోర్స్, San Diego Safari Park/ Facebook

ఫొటో క్యాప్షన్,

ఐదు తరాలకు ‘విలా’యే పెద్దదిక్కు

‘‘విలాను కోల్పోవటం జూ సభ్యులు, అతిథులు, వలంటీర్లు, సిబ్బందికి తీరని లోటు’’ అని సఫారీ పార్కులో పాలిచ్చే జంతువులకు సంరక్షకుడైన రాండీ రిచెస్ అన్నారు.

మానవుల సంరక్షణలో అత్యధిక కాలం జీవించిన గొరిల్లాగా ఆర్కన్సాస్‌లోని లిటిల్ రాక్ జూలోని 61 ఏళ్ల ట్రుడీగా భావిస్తున్నారు.

విలా లాగానే ట్రుడీని కూడా అడవి నుంచే తీసుకొచ్చారు.

మానవుల సంరక్షణలో పుట్టి.. అత్యధిక కాలం జీవించిన గొరిల్లా.. కోలో గతేడాది మరణించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)