తాలిబన్ అగ్రనేతలు, అమెరికా సీఐఏ అధికారులపై ఆఫ్ఘన్ బాధితుల ఫిర్యాదు.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది?

తాలిబన్ అగ్రనేతలు, అమెరికా సీఐఏ అధికారులపై ఆఫ్ఘన్ బాధితుల ఫిర్యాదు.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది?

నలభయ్యేళ్ళుగా దాడులతో అట్టుడికిపోతున్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లో .. గత వారం మరింత దారుణమైన హింసాత్మక ఘటనలు సంభవించాయి.

ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులు, ఆఫ్ఘన్ బాధితులు సమర్పించిన ఫిర్యాదులను పరిశీలించే పని ప్రారంభించారు. యుద్ధ నేరాలపై అధికారిక విచారణకు అదేశించే విషయమై కూడా ఈ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

ఇందుకు అమెరికా అంగీకరించలేదు. ఇందులో మరో మెలిక ఉన్న విషయం ఏంటంటే ఒకవేళ అమెరికా పౌరులు విచారణకు హాజరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టాల్సిందేనని ఒక చట్టం చెబుతోంది.

న్యాయం లభిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్న ఆప్ఘనిస్తాన్ బాధితులతో బీబీసీ మాట్లాడింది.

ఆఫ్ఘనిస్థాన్ లోని శనివారం జరిగిన భారీ బాంబు పేలుడు దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆ దాడిలో వంద మంది చనిపోయారు. అఫ్ఘానిస్థాన్ లో రకరకాల సంస్థలు మానవత్వంపై చేసిన దారుణమైన దాడుల్లో ఇదొకటి. తాలిబన్ అగ్రనేతలు, సీఐఏ అధికారులతో పాటు అఫ్ఘాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులపై యుద్ధ నేరాలు మోపి విచారణ చేపట్టే అంశంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

ఫొటో సోర్స్, Getty Images

32 ఏళ్ల సమార ఓ అనాథాశ్రమంలో వంటమనిషిగా పనిచేసేవారు. గత జూలై లో తాలిబన్లు చేసిన బాంబు దాడిలో చనిపోయారు. సమార కూతురైన పదిహేడేళ్ల ఫాతిమా తాలిబన్లపై ఐసీసీ విచారణ చేపట్టాలని అంటున్నారు. అఫ్ఘాన్ అధికారుల మీద ఆమెకు నమ్మకం పోయింది.

ఫాతిమా తల్లికి న్యాయం జరగాలంటే ముందు దోషుల్ని గుర్తించాలి. ఆ తర్వాత వారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతిపాదించిన విచారణ.. 2003 నుంచి జరిగిన నేరాల మీద దృష్టి సారిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గ్వాంటమావో జైలుకు తరలించిన నేరస్థులు కొందరు ఇందులో ఉన్నారు.

మొదట్లో చాలా మందిని కాబుల్ బయట ఉన్న బగ్రాం కేంద్రంలో నిర్భందించారు. క్యాంపెయిన్ గ్రూప్ రిప్రైవ్ సంస్థ ముగ్గురి తరఫున ఐసీసీకి విజ్ఞప్తులు సమర్పించింది.

ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో చేపట్టాలనుకుంటున్న దర్యాప్తు అక్రమమైనదని, అనధికారికమని అమెరికా అధికారులు అంటున్నారు. పైగా అందరికంటే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కుంటుంది ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు అబ్దుల్ రషీద్ దోస్తుం. ఈయన దశాబ్దాలుగా అత్యాచారాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నియి.

తాను ఎటువంటి తప్పు చేయలేదంటూ.. తనపై వచ్చిన ఆరోపణలను దోస్తుం ఖండించారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు న్యాయమూర్తులు లాంఛనప్రాయమైన దర్యాప్తునకు ఆదేశించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కానీ దశాబ్దాల హింసకు బాధితులైన ఆఫ్ఘన్ దేశ ప్రజలు న్యాయం కోసం నిస్పృహతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)