Live Score: దక్షిణాఫ్రికాను 9 వికెట్లతో ఓడించిన భారత్

  • 4 ఫిబ్రవరి 2018
విరాట్ కోహ్లి శిఖర్ ధావన్ Image copyright Getty Images/LAKRUWAN WANNIARACHCHI

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యాన్ని కేవలం 20.3 ఓవర్లలోనే ఛేదించింది.

ఆరు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను కైవసం చేసుకుని 2-0 ఆధిక్యంలో నిలిచింది.

రోహిత్ శర్మ 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. శిఖర్ ధావన్ 51, విరాట్ కోహ్లీ 46 పరుగులు సాధించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సఫారీలకు భారత స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్‌దీప్ యాదవ్‌లు చెమటలు పట్టించారు.

39 పరుగుల వద్ద తొలి వికెట్‌ను పడగొట్టి, 51 పరుగులకు చేరేవరకు మరో ముగ్గురిని పెవిలియన్‌ బాట పట్టించారు.

Image copyright Getty Images

డుమినీ రంగంలోకి దిగిన తర్వాత ఆతిథ్య జట్టు కాస్త నిలదొక్కుకున్నట్టు అనిపించినా.. 99 పరుగుల నుంచి చూస్తుండగానే మళ్లీ వరుసగా వికెట్లు పడ్డాయి.

దాంతో 32.2 ఓవర్లలో కేవలం 118 పరుగులు మాత్రమే చేసి సఫారీలు ఆలౌట్ అయ్యారు.

భారత బౌలర్లు యుజువేంద్ర చహల్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కుల్‌దీప్ యాదవ్ మరో మూడు వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా తన సొంత గడ్డపై అతితక్కువ పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఇదే.

పూర్తి స్కోర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Image copyright ANESH DEBIKY/AFP/Getty Images

ఈ మ్యాచ్‌లో సఫారీల జట్టు కెప్టెన్ డూప్లెసిస్ లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. డర్బన్‌లో జరిగిన తొలి వన్డే సందర్భంగా డూప్లెసిస్ గాయపడిన విషయం తెలిసిందే.

భారత జట్టు:

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఆజింక్యా రహనే, మహేంద్రసింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, యుజువేంద్ర చహల్

దక్షిణాఫ్రికా జట్టు:

క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఆమ్లా, మార్క్ రమ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డుమిని, మోరిస్, ఇమ్రాన్ తాహిర్, ఖేయ జొండొ, రబడా, మోర్నె మోర్కెల్, షాంషి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు