సెంచూరియన్ వన్డే: 5 ఆసక్తికర విషయాలివే!

  • 4 ఫిబ్రవరి 2018
చహాల్ Image copyright Getty Images

ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌కి సంబంధించిన ఐదు ఆసక్తికర విషయాలు చూద్దాం.

  1. ఇద్దరు స్పిన్లర్లు కలిసి మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టారు. యుజువేంద్ర చహల్‌కు 5 వికెట్లు లభించగా కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు కూల్చాడు.
  2. దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు డూప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు.
  3. గాయం కారణంగా డూప్లెసిస్ ఈ మ్యాచ్‌కి దూరంగా ఉన్నారు. దాంతో 23 ఏళ్ల మార్క్‌రమ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఇది అతని తొలి మ్యాచ్.
  4. దక్షిణాఫ్రికా సొంత గడ్డపై అతి తక్కువ పరుగులు చేసింది ఈ మ్యాచ్‌లోనే.
  5. సెంచూరియన్ మైదానంలో జరిగిన ఆఖరి 6 వన్డేలలో ఐదు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పరాజయం పాలయ్యింది (తాజా వన్డేతో కలిపి).

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు