చిరుత నుంచి జింక ఎలా తప్పించుకుందో చూడండి!

చిరుత నుంచి జింక ఎలా తప్పించుకుందో చూడండి!

జింకను చిరుత పులి వేటాడుతుంటే ఎంత ఉత్కంఠగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. జింకను ఛేజ్ చేసేందుకు చిరుత వాయు వేగంతో దూసుకెళ్తుంది. ఇక జింక పని ఖతం! అనుకునే సమయంలో పరిస్థితి తారుమారు అవుతుంది.

నిజానికి చిరుత పులి కంటే వేగంగా జింక పరుగెత్తలేదు. కానీ, ఆఖరి క్షణాల్లో మలుపులు తిరగడం, ఒక్కసారిగా దిశను మార్చుకుని పరుగెత్తడం వల్ల అది ప్రాణాలతో బయటపడగలదు.

అయితే, ఇతర జంతువుల మాదిరిగా చిరుత అప్పటికప్పుడు దిశను మార్చుకోలేదు.

అందుకే అంటారు, ఎంత బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుందని!

భూమిపై అత్యంత వేగంగా పరుగెత్తే మృగం సాగించే వేటలో ఎన్ని మలుపులు ఉంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది.

చిరుత నుంచి జింక ఎలా తప్పించుకుందో ఈ వీడియోలో చూడొచ్చు!

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)