అమెరికా మళ్లీ ఆగిపోయింది

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిర్ణీత గడువులోగా ద్రవ్య వినిమయ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొందకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి.

ఇలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడం మూడు వారాల్లో ఇది రెండోసారి.

రెండేళ్ల వరకు నిధుల వినియోగానికి ప్రభుత్వానికి వీలు కల్పించే ఈ బిల్లు గురువారం అర్ధరాత్రిలోగా ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంది.

అయితే, ఖర్చులపై పరిమితి విధించేందుకు తాను ప్రవేశపెట్టిన సవరణపై చర్చించాలంటూ రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ పట్టుబట్టారు. దాంతో సెనేట్‌లో బిల్లుపై ఓటింగ్‌ ఆగిపోయింది.

సెనేట్‌ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ బిల్లుపై హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో ఓటింగ్ జరిగే వీలుంటుంది.

శుక్రవారం ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇలాంటి పరిస్థితే జనవరిలోనూ తలెత్తింది. అప్పుడు మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చూడండి: