ఈ ‘పులి’ ఏం చేసిందో తెలుసా?

ఫొటో సోర్స్, Facebook
ఆయనో రైతు.. శనివారం రాత్రి పశువుల పాక సమీపంలోకి వెళ్తే ‘పులి’ కనిపించింది.
వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పులి ఫొటోను కూడా పంపాడు.
పోలీసులు వెంటనే తమ ఆయుధాలతో పలు వాహనాల్లో హడావుడిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
దగ్గర్లో ఏవైనా అడవులు, అభయారణ్యాల నుంచి పులి ఏదైనా తప్పించుకుందా అనీ ఆరా తీశారు.
ఫొటో సోర్స్, Police Scotland
రైతు పోలీసులకు పంపిన పులి ఫొటో
మొత్తానికి పోలీసులు పులి ఉన్న చోటుకు వెళ్లారు.
చాలా జాగ్రత్తగా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
అయితే అది ఎంత సేపటికీ ఉలకలేదు.. పలకలేదు.
అప్పుడర్థమైంది వాళ్లకు.. అది పులి కాదు.. పులి బొమ్మ అని.
ఈ ఘటన స్కాట్లండ్‌లోని అబర్దీన్షైర్ ఫామ్ సమీపంలోని హట్టన్ గ్రామంలో జరిగింది.
''ప్రజల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అందుకే పులి గురించి సమాచారం అందగానే ఆయుధాలన్నీ సిద్ధం చేసుకుని, దగ్గరలో ఉన్న అటవీ సంరక్షణ ప్రాంతం నుంచి పులి గురించి ఆరా తీశాం'' అని ఇన్స్పెక్టర్ జార్డ్ కార్డినల్ తెలిపారు.
అయితే ఇందులో రైతు తప్పేమీ లేదని ఇన్స్పెక్టర్ అన్నారు. ఆ రైతు మంచి ఉద్దేశంతోనే పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడని, అది బొమ్మ పులే అయినా ఇందులో అతణ్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)