గూగుల్‌ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా

గూగుల్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో 'శోధనలో వివక్ష' ప్రదర్శించినందుకు గూగుల్‌కు సుమారు రూ.136 కోట్ల జరిమానా విధించారు.

యూజర్లు విమాన పర్యటన వివరాల కోసం శోధించినపుడు గూగుల్ వారిని తన సొంత వాణిజ్య ప్రకటనలు ఉన్న సైట్లకు రీడైరెక్ట్ చేసేదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన తీర్పులో పేర్కొంది.

దీంతో గూగుల్ శోధనలో వివక్ష ప్రదర్శించిందంటూ ప్రత్యర్థి సంస్థలు గూగుల్‌పై దావా వేశాయి.

190 పేజీల నివేదికలో సీసీఐ - గూగుల్ తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని తన ప్రత్యర్థులు, గూగుల్ యూజర్లు ఇద్దరినీ మోసం చేసిందని పేర్కొంది.

యూజర్లు విమానాల వివరాల కోసం వెదుకుతున్నపుడు గూగుల్ వారిని అక్రమంగా తన ఫ్లైట్ సెర్చ్ పేజీకి డైరెక్ట్ చేసినట్లు కమిషన్ తన తీర్పులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

తీర్పును పరిశీలిస్తున్నట్లు గూగుల్ ప్రతినిధి రాయిటర్స్‌కు తెలిపారు.

తామెన్నడూ యూజర్ల అవసరాలు తీర్చడం మీదనే దృష్టి పెడతామని వివరణ ఇచ్చారు.

గూగుల్ ఈ జరిమానాను 60 రోజుల్లోపల జమ చేయాల్సి ఉంటుంది.

2012లో భారత్ మ్యాట్రిమోని, మరో వినియోగదారుల రక్షణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదులపై విచారించిన సీసీఐ ఈ ఆదేశాలు వెలువరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)