అంతర్జాతీయ వన్య ఫొటోగ్రఫీ 2018లో మదిని దోచుకునే ఫొటోలు

బ్రెజిల్‌లోని విశాల బయలు ప్రాంతం సెరాడోను 'సెరాడో సన్‌రైజ్' పేరిట మార్సియో కాబ్రాల్ తీసిన ఈ ఫొటో ఫస్ట్ ప్రైజ్ గెల్చుకుంది.

సూర్యోదయంలో వెలుగులు విరజిమ్ముతున్న పుష్పాలు

ఫొటో సోర్స్, Marcio Cabral

సూర్యోదయ వెలుగులో వేలాది పపలాంథస్ చికిటెన్సిస్ చెట్ల చివర పూచిన పూలు ఫిలమెంట్లలా వెలుగులు చిమ్ముతున్న ఈ చిత్రం మొదటి ప్రైజ్ గెల్చుకోవడంలో ఎలాంటి వింతా లేదు.

చైనాలో బంగారు వర్ణంలోని వరి పొలాల నుంచి ఆస్ట్రియాలో పుష్పసౌరభాన్ని ఆఘ్రాణిస్తున్న చిట్టెలుక వరకు ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన, అన్ని కాలాల్లో తీసిన ఫొటోలు ప్రకృతి అందానికి అద్దం పట్టాయి.

ఫొటో సోర్స్, Mark Bauer

ఫొటో క్యాప్షన్,

డోర్సెట్‌లోని నేషనల్ నేచర్ రిజర్వ్‌లో మార్క్ బాయర్ కెమెరా కంటపడిన వంగపండు రంగున్న పొదలు

ఫొటో సోర్స్, Annie Green-Armytage

ఫొటో క్యాప్షన్,

మరో ప్రపంచానికి ద్వారం తెరుస్తున్నట్లున్న ఈ దృశ్యం, జర్మనీలేని బవేరియాలో అన్నీ గ్రీన్-ఆర్మిటేజ్ కంటపడింది

ఫొటో సోర్స్, Shaofeng Zhang

ఫొటో క్యాప్షన్,

వెనకాల మేఘాలు, ముందు బంగారు వర్ణంలోని వరి పొలాలు. ఈ దృశ్యం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఫొటోగ్రాఫర్ షావోఫెంగ్ జాంగ్ కెమెరాకు చిక్కింది

ఫొటో సోర్స్, Yi Fan

ఫొటో క్యాప్షన్,

చైనాలోని యునాన్ ప్రాంతంలో అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన ఔషధ మొక్కలు ఫొటోగ్రాఫర్ యి ఫాన్ కెమెరాకి చిక్కాయి

ఫొటో సోర్స్, Steve Lowry

ఫొటో క్యాప్షన్,

మైక్రోస్కోప్ ద్వారా కలపలోని కణాల నిర్మాణాన్ని పోలరైజ్డ్ లైట్‌తో ఎక్స్‌పోజ్ చేసి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన స్టీవ్ లౌరీ ఈ ఫొటోను తీర్చిదిద్దారు

ఫొటో సోర్స్, Mauro Tronto

ఫొటో క్యాప్షన్,

మౌరో ట్రొంటో కెమెరాలో ఇటలీలోని పిడ్‌మోంట్‌లో ఉన్న వాల్ బుస్కాగ్నా ఇలా అందంగా ఒదిగిపోయింది

ఫొటో సోర్స్, Henrik Spranz

ఫొటో క్యాప్షన్,

ఆస్ట్రియాలోని వియన్నాలో పుష్ప సౌరభాన్ని ఆఘ్రాణిస్తున్న అడవి చిట్టెలుక. దీన్ని హెన్రిక్ స్ప్రాంజ్ తన కెమెరాలో బంధించారు

ఫొటో సోర్స్, Marianne Majerus

ఫొటో క్యాప్షన్,

మంచులో గడ్డకట్టుకుపోయిన లక్సెంబర్గ్‌లోని న్యూ కాజిల్‌. మారియన్ మజేరస్ కెమెరాలో ఆ క్షణం ఫ్రీజ్ అయిపోయింది

ఫొటో సోర్స్, Cathryn Baldock

ఫొటో క్యాప్షన్,

అడవి లతల ఫొటోలను ఒకదానిపై ఒకటి ప్రొజెక్ట్ చేసి, కాథరిన్ బాల్డోక్ తీసిన ఈ ఫొటో అబ్‌స్ట్రాక్ట్ విభాగంలో బహుమతి గెలుచుకుంది.

ఫొటో సోర్స్, John Glover

ఫొటో క్యాప్షన్,

ఈ సూర్యోదయం తూర్పు ససెక్స్‌లో జాన్ గ్లోవర్ కంటపడింది

ఫొటో సోర్స్, Alan Price

ఫొటో క్యాప్షన్,

గూడును ఎక్కడ కట్టుకుందామా అని అన్వేషిస్తున్న బ్లాక్‌బర్డ్ పక్షి అలన్ ప్రైజ్ కెమెరా కంటికి చిక్కింది

ఫొటో సోర్స్, Nigel McCall

ఫొటో క్యాప్షన్,

వేల్స్‌లోని కార్మంథన్‌షైర్‌లో ఉన్న అబెర్‌గ్లాస్నె గార్డెన్స్. ఫొటోగ్రాఫర్ నిజెల్ మెకాల్

ఫొటో సోర్స్, Minghui Yuan

ఫొటో క్యాప్షన్,

సరికొత్త హెయిర్ స్టైల్‌తో మొక్క పైకి ఎక్కుతున్న ఈ గొంగళిపురుగు చైనాలోని వుహాన్ నగరంలో మింగ్‌హుయ్ యువాన్ కెమెరా కంట చిక్కింది

ఫొటో సోర్స్, Anne Maenurm

ఫొటో క్యాప్షన్,

మే నెలలో స్లొవేనియాలోని గోలికా పర్వత వాలుపై విస్తారంగా పూచిన నార్సిసస్ అడవిపూలు. అన్నె మేనర్మ్ దీని ఫొటోగ్రాఫర్

ఫొటో సోర్స్, Hans Van Horssen

ఫొటో క్యాప్షన్,

హెలెనియం పువ్వు చుట్టూ తన బిడ్డకు రక్షణ కవచాన్ని నిర్మించుకుంటున్న సాలీడు. ఈ సాలీడు నెదర్లాండ్స్‌లో హాన్స్ వాన్ హార్సెన్ కెమెరాకు చిక్కింది

ఫొటో సోర్స్, Andrea Pozzi

ఫొటో క్యాప్షన్,

కెనడాలోని టాంబ్‌స్టోన్ టెర్రిటోరియల్ పార్క్. ఆండ్రియా పోజి తీసిన ఈ ఫొటో బ్రీతింగ్ స్పేసెస్ విభాగంలో మొదటి బహుమతి గెల్చుకుంది.

ఫొటో సోర్స్, Alison Staite

ఫొటో క్యాప్షన్,

లండన్‌లోని రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో పల్సటిల్లా పుష్పాలు. అలిసన్ స్టెయిట్ దీని ఫొటోగ్రాఫర్

ఫొటో సోర్స్, Volker Michael

ఫొటో క్యాప్షన్,

జర్మనీలో గుబాళిస్తున్న విస్టేరియా పూలు. కెమెరా చిత్రకారుడు వోల్కర్ మైఖేల్

ఫొటో సోర్స్, Frantisek Rerucha

ఫొటో క్యాప్షన్,

ఇవి కేవలం వాడిపోయిన పూలు అంటే నమ్మడం కష్టం. ఫ్రాంటిసెక్ రెరుచా వాటికి తన కెమెరాతో ప్రాణం పోశారు

ఫొటో సోర్స్, William Dore

ఫొటో క్యాప్షన్,

స్కాట్లండ్‌లో వర్షం, మంచు.. మధ్యలో ఒంటరిగా కనిపిస్తున్న కొన్ని పైన్ చెట్లు. విలియమ్ డోర్ వీటిని ఇలా కెమెరాలో బంధించారు

ఫొటో సోర్స్, Masumi Shiohara

ఫొటో క్యాప్షన్,

మసుమి షియోహారా తీసిన ఈ ప్లమ్ పళ్ల స్టిల్ ఫొటోకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి

ఫొటో సోర్స్, Clay Bolt

ఫొటో క్యాప్షన్,

పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా తేనెటీగలు ఎదుర్కొంటున్న సమస్యలను క్లే బోల్ట్ తన చిత్రం ద్వారా విశదీకరించడానికి ప్రయత్నించారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)