అనుమానాస్పద ఉత్తరం తెరిచి ఆసుపత్రి పాలైన ట్రంప్ కోడలు

  • 13 ఫిబ్రవరి 2018
వెనెసా ట్రంప్ Image copyright Getty Images

అమెరికా అధ్యక్షుడి కోడలు వెనెసా ట్రంప్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఒక అనుమానాస్పద ఉత్తరాన్ని (లిఫాఫా) తెరిచిన వెంటనే ముందు జాగ్రత్త కోసం ఇలా చేశారు.

ఆ అనుమానాస్పద ఉత్తరంపై తెల్లని పౌడర్ పూసి ఉందని పోలీసులు చెబుతున్నారు.

ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ మ్యాన్‌హటన్ చిరునామాకు ఈ ఉత్తరం చేరింది.

ఆ సమయంలో అక్కడున్న వెనెసా ట్రంప్ సహా మరో ఇద్దరిని అగ్నిమాపక దళం ఆసపత్రికి చేర్చింది.

అయితే ఈ పౌడర్ ప్రమాదకరమైందేమీ కాదని పరీక్షలో తేలినట్టు న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది.

ఆ పౌడర్ వల్ల వెనెసా ట్రంప్‌పై శారీరకంగా ఏ రకమైన ప్రభావం పడలేదని కూడా పోలీసులు అన్నారు.

Image copyright Getty Images

ఉత్తరంపై సాగుతున్న దర్యాప్తు

ఈ ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులను వీల్ కార్నెల్ మెడికల్ కాలేజిలో చేర్చినట్టు అగ్నిమాపక దళం తెలిపింది.

సీబీఎస్ న్యూయార్క్ కథనం ప్రకారం, ఈ ఉత్తరాన్ని వెనెసా ట్రంప్ తల్లి స్వీకరించారు. ఆ తర్వాత వెనెసా దాన్ని తెరిచారు.

వెనెసా ట్రంప్, ట్రంప్ జూనియర్‌ల వివాహం 2005లో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. పెళ్లికి ముందు వెనెసా న్యూయార్క్‌లో మోడలింగ్ చేసేవారు.

ట్రంప్ జూనియర్ కుటుంబానికి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఉత్తరంపై దర్యాప్తు జరుపుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మెక్సికో: డ్రగ్ మాఫియాతో దేశమంతా రక్తసిక్తం... ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు

మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణం ఏమిటో తెలుసా...

భారత్‌లో మొబైల్ డేటా రేట్లు ఏ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి...

బ్యాంకులు మహిళలకు తక్కువ, మగవారికైతే ఎక్కువ రుణాలు ఇస్తున్నాయా...

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆకలి, చలి... బయటకొస్తే జైలు

‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్

చంద్రబాబుపై ఏసీబీ కోర్టు విచారణ.. లక్ష్మీపార్వతి 14 ఏళ్ల కిందట వేసిన కేసులో కదలిక

'శబరిమల ఆలయంలోకి వెళ్తా. నన్ను అడ్డుకోలేరు’ - తృప్తి దేశాయ్