అమెరికా: తుపాకీ హింస తీరు ఇదీ

ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న దేశం అమెరికానే. ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నా ఈ దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు.

అమెరికాలో తుపాకుల ఖరీదుపై గ్రాఫిక్
ఫొటో క్యాప్షన్,

అమెరికాలో పౌరులపై ఉన్మాద కాల్పులు జరిగిన ప్రతిసారీ తుపాకుల వినియోగానికి కళ్లెం వేయాలనే డిమాండ్ వినిపిస్తుంటుంది. తాజా కాల్పుల ఘటనతో ఇది మరింత బలంగా వినిపిస్తోంది. అమెరికాలో జరిగే హత్యలు, ఆత్మహత్యల్లో అత్యధికంగా తుపాకీనే వాడుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు. గ్రామీణులు ఎక్కువగా ఉండే న్యూయార్క్, కాలిఫోర్నియాతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువ.

ఫొటో క్యాప్షన్,

ఆయుధాల వినియోగాన్ని నియంత్రించేందుకు బలమైన చట్టాలు తీసుకురాకుండా అడ్డుకునే వారు అమెరికాలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. అందువల్లే తుపాకీ సంస్కృతికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

ఫొటో క్యాప్షన్,

అమెరికాలో ఆయుధాల నియంత్రణ బిల్లులు సెనేట్ ఆమోదానికి నోచుకోవడం లేదు. బిల్లులను వ్యతిరేకించే వర్గం కావాలనే ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేస్తోంది.

ఫొటో క్యాప్షన్,

లాస్ వెగాస్ తరహా హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారీ ఆందోళనలు సద్దుమణిగే వరకు అమెరికా చట్టసభల్లో కాలయాపన జరిగేలా తుపాకుల వినియోగాన్ని సమర్థించేవారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

అమెరికాలో ప్రతి పౌరుడు తుపాకీని కలిగి ఉండే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అనుమతుల జారీలోగానీ, తుపాకీ కొనుగోలుకుగానీ కఠిన నిబంధనలు ఉండరాదని నిర్దేశించింది. రాష్ట్రాలు తీసుకొచ్చే కఠిన నిబంధనలను సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దిగువ కోర్టులూ కొట్టి వేస్తున్నాయి.