సర్వే: వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు

ఫొటో సోర్స్, Getty Images
వయసు మళ్లిన తర్వాత సెక్స్‌పై ఆసక్తి బాగా తగ్గిపోతుందని చాలా మంది అనుకొంటుంటారు. తమకు ప్రేమపూర్వక సాహచర్యముంటే చాలనే ఆలోచనే వృద్ధుల్లో ఉంటుందని భావిస్తుంటారు. ఇది వాస్తవ విరుద్ధమని బ్రిటన్‌లో జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది.
2,002 మంది వృద్ధులపై ఈ సర్వే నిర్వహించారు.
65 ఏళ్లు పైబడిన వారిలో 52 శాతం మంది తాము కోరుకొనే స్థాయిలో శృంగారానుభూతిని పొందలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో, తొలి డేట్ సందర్భంగానే సెక్స్‌లో పాల్గొనేందుకు తాము సిద్ధమని మూడో వంతు మంది తెలిపారు.
75 ఏళ్లు పైబడిన ప్రతీ పదిమందిలో ఒకరు వారికి 65 ఏళ్లు నిండినప్పటి నుంచి ఒకరి కంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొన్నారు.
శృంగారానికి వయసు అడ్డు కాదని సర్వే చెబుతోందని దీన్ని నిర్వహించిన 'ఇండిపెండెంట్ ఏజ్' సంస్థ వ్యాఖ్యానించింది.
ఫొటో సోర్స్, Getty Images
వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఒక జంట
సెక్స్ విషయంలో తనకు వయసు అడ్డంకి కాలేదని బ్రిటన్‌లోని సోమర్సెట్ ప్రాంతానికి చెందిన 84 ఏళ్ల డెన్నిస్ అలెన్ తెలిపారు.
2004లో ఆయన నాలుగోసారి పెళ్లి చేసుకొన్నారు. అలెన్ భార్య పాలీన్కు ఇప్పుడు 85 ఏళ్లు.
సగటున వారానికి రెండుసార్లు తాము శృంగారంలో పాల్గొంటామని అలెన్-పాలీన్ జంట తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తామని, ఒకరికొకరు ఇప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తామని వారు సంతోషంగా చెప్పారు.
'అవకాశం రాకపోవడమే ప్రధాన కారణం'
65 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారిలో ప్రతీ ఆరుగురిలో ఒకరు.. తాము సెక్స్‌కు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశం రాకపోవడమేనని చెప్పారు.
80 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్నవారిలో ప్రతి ఆరుగురిలో ఒక్కరు మాత్రమే వారు కోరుకొన్నంతగా సెక్స్‌లో పాల్గొనగలుగుతున్నారని సర్వే తేల్చింది.
ఫొటో సోర్స్, Getty Images
వృద్ధుల లైంగిక ఆరోగ్యంపై కొరవడిన చర్చ
సెక్స్ విషయంలో 65 ఏళ్లు పైబడినవారు చాలా మంది అనుకొనేదాని కన్నా చురుగ్గా ఉంటారని 'ద టెరెన్స్ హిగిన్స్ ట్రస్ట్'కు చెందిన లూసీ హార్మర్ బీబీసీతో చెప్పారు.
కొత్తవారితో సంభోగంలో పాల్గొనేటప్పుడు, శృంగారం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్లను(ఎస్టీఐలను) నివారించేందుకు తాము ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోవట్లేదని 65 ఏళ్లు పైబడినవారిలో ప్రతీ 11 మందిలో ఒకరు సర్వేలో తెలిపారు.
లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన చర్చలు, అవగాహన కార్యక్రమాల్లో దాదాపు అందరూ యువతపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, వృద్ధుల శృంగార జీవితంపై పెద్దగా చర్చ జరగడం లేదని ఈ ట్రస్టుకు చెందిన డెబ్బీ లేకాక్ విచారం వ్యక్తంచేశారు.
దీని కారణంగా లైంగిక ఆరోగ్యం, శృంగారం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్ల నివారణ అంశాలు యువతతో ముడిపడినవే తప్ప, తమకు సంబంధించినవి కాదనే అపోహ చాలా మంది వృద్ధుల్లో ఏర్పడిందని డెబ్బీ లేకాక్ విశ్లేషించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- #HerChoice: 'నేను సోషల్ మీడియాలో పరాయి మగాళ్లతో చాట్ చేస్తాను!'
- #HerChoice: చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
- #HerChoice: భర్త వదిలేశాక, నాతో నేను ప్రేమలో పడ్డాను సరికొత్తగా!
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- #HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
- #HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)