చికాకు పెట్టే ప్రకటనలకు గూగుల్ చెక్!

ఫొటో సోర్స్, AFP
కొన్ని వెబ్సైట్లను తెరవగానే తెరనిండా వీడియో ప్రకటనలు వాటంతట అవే ప్లే అవుతుంటాయి. వాటిలో కొన్ని వినియోగదారులకు చికాకు పుట్టించేలా, అభ్యంతరకరంగానూ ఉంటాయి.
అయితే, ఇక నుంచి అలాంటి ప్రకటనలను అడ్డుకునేలా క్రోమ్ బ్రౌజర్ కోసం కొత్త యాడ్- బ్లాకర్ టూల్‌ను ప్రారంభించినట్లు గూగుల్ వెల్లడించింది.
ఏ వెబ్సైట్లలో అలాంటి అనుచితమైన ప్రకటనలు ఉన్నాయో గుర్తించేందుకు 'ది కోఅలిషన్ ఫర్ బెటర్ యాడ్స్ (సీబీఏ)' సంస్థ సాయం తీసుకోనున్నట్లు తెలిపింది.
ప్రకటనలు తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో, లేవో పరిశీలించేందుకు గూగుల్, ఫేస్బుక్ లాంటి కొన్ని దిగ్గజ సంస్థలు కలిసి సంయుక్తంగా సీబీఏను ఏర్పాటు చేశాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ ఏదైనా వెబ్సైట్లో ప్రమాణాలను అతిక్రమించేలా ఉన్నాయని సీబీఏ పరిశీలకులు గుర్తించగానే ఆ ప్రకటనలను గూగుల్ బ్లాక్ చేసేస్తుంది. తర్వాత ఆ వెబ్సైట్ యజమానికి గూగుల్ 30 రోజుల గడువు ఇస్తుంది. ఆ వ్యవధిలో ప్రకటనలు తొలగించకపోతే ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టేస్తుంది.
అమెరికా, యూరప్ దేశాల్లో దాదాపు 40 వేల మంది నెటిజన్ల నుంచి గూగుల్ అభిప్రాయాలు స్వీకరించింది. వెబ్సైట్లలో తమ ప్రయేమం లేకుండానే తెర నిండా యానిమేషన్‌తో కూడిన వీడియోలు, పాప్ అప్ ప్రకటనలు చికాకు పుట్టిస్తున్నాయని చాలా మంది చెప్పారు.
అందుకే ఈ టూల్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ తన బ్లాగులో పేర్కొంది.
ఇవి కూడా చూడండి:
- గూగుల్‌లో ఉద్యోగం వదిలేశాడు.. అమ్మతో కలిసి హోటల్ పెట్టాడు
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్'లు.. ఓ అంతర్జాతీయ సమస్య!
- చిత్తూరు: సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఏడుగురు కార్మికులు మృతి
- 'మా చాయ్ ఇరానీ.. మేం మాత్రం పక్కా హైదరాబాదీ!'
- పంజాబ్ నేషనల్ బ్యాంకు: 11,360 కోట్ల కుంభకోణం అసలెలా జరిగింది!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)