తొలి టీ20లో భారత్ విజయం

  • 18 ఫిబ్రవరి 2018
భారత క్రికెట్ జట్టు Image copyright facebook/icc

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 28పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 5వికెట్లు పడగొట్టాడు.

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్, శిఖర్ ధావన్ చెలరేగడంతో 203 పరుగులు నమోదు చేసింది. ధావన్ 10ఫోర్లు, 2 సిక్సులతో 39బంతుల్లోనే 72పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లి(26), మనీష్ పాండే(29), రోహిత్ శర్మ(21, 9బంతుల్లో) ధాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.

204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా, భువనేశ్వర్ కుమార్ దెబ్బకు 20ఓవర్లలో 175పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉనద్కత్, హార్థిక్ పాండ్య, చాహల్‌లు తలో వికెట్ పడగొట్టారు.

భువనేశ్వర్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

టీ20ల్లో దక్షిణాఫ్రికాపైన భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. భారత్ పవర్‌ప్లేలో అత్యధికంగా 78పరుగులను సైతం ఈ మ్యాచ్‌లోనే నమోదుచేసింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 ఫిబ్రవరి 21న జరగనుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు