పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి

  • 19 ఫిబ్రవరి 2018
ఇమ్రాన్ ఖాన్ Image copyright @PTIofficial/Twitter
చిత్రం శీర్షిక పెళ్లికి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు

బుష్రా మానికాతో తమ నేత ఇమ్రాన్ ఖాన్‌ వివాహం జరిగిందని పాకిస్తాన్‌ తహ్రీక్-ఏ-పాకిస్తాన్ పార్టీ (పీటీఐ) ప్రకటించింది. ఇది ఆయనకు మూడో పెళ్లి.

ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ పీటీఐ ఆయనకు అభినందనలు తెలిపింది.

"ఆదివారం, ఫిబ్రవరి 18న రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులూ, సన్నిహిత మిత్రుల సమక్షంలో నికాహ్ జరిగింది" అని పీటీఐ తన ట్వీట్‌లో తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ పెళ్లి జరుగబోతున్నట్టు గత నెలలోనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే బుష్రా మానికా అనే మహిళను ఇమ్రాన్ ఖాన్‌కు ప్రపోజ్ చేశారనీ, ఆమె నుంచి జవాబు కోసం ఎదురుచూస్తున్నారని అప్పట్లో తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ నేత ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు.

పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ బుష్రా మానికా, "అల్లాహ్ కృపతో మేం ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. మీ ఆశీర్వాదాలు కావాలి" అని రాశారు.

ఇమ్రాన్ ఖాన్, బుష్రా మానికాల నికాహ్ ముఫ్తీ సయీద్ ఆధ్వర్యంలో జరిగినట్టు పీటీఐ విడుదల చేసిన ఫొటో ద్వారా తెలుస్తోంది.

గతంలో రేహమ్ ఖాన్‌తో ఇమ్రాన్ ఖాన్ నికాహ్‌ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది.

ఇమ్రాన్ ఖాన్, బుష్రా మానికాల పెళ్లి వార్త వెలువడగానే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. 'ముబారక్ ఇమ్రాన్ ఖాన్' ప్రస్తుతం పాకిస్తాన్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

Image copyright @PTIofficial/Twitter
చిత్రం శీర్షిక ముఫ్తీ సయీద్ ఆధ్వర్యంలో ఇమ్రాన్ ఖాన్ నికాహ్ జరిగింది.

దాదాపు పీటీఐ నేతలందరూ ట్విటర్‌లో అభినందన సందేశాలు పోస్ట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ 2015లో టీవీ యాంకర్ రేహమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. అప్పటి పెళ్లి వార్తలు కూడా కన్‌ఫర్మ్ కావడానికి చాలానే సమయం పట్టింది.

Image copyright IMRAN KHAN OFFICIAL
చిత్రం శీర్షిక గతంలో ఇమ్రాన్ ఖాన్ టీవీ యాంకర్ రేహమ్ ఖాన్‌ను వివాహమాడారు.

పెషావర్ పబ్లిక్ స్కూలులో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో దేశమంతా సంతాపం పాటిస్తున్న సమయంలో ఆయన రెండో పెళ్లి వార్త బయటకు వచ్చింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

‘కడుపు కాలే రోడ్లపైకి వచ్చాం.. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలిచ్చి అర్హత లేదని వెనక్కి తీసుకున్నారు.. ఎందుకు

భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

‘‘జీతంపైనే ఆధారపడి బతికే కుటుంబం.. అందరం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది’’

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి