ఈ చీర్‌లీడర్స్ చిరునవ్వు వెనకున్న రహస్యమేంటి?

ఈ చీర్‌లీడర్స్ చిరునవ్వు వెనకున్న రహస్యమేంటి?

దక్షిణ కొరియాలోని ప్యెంగ్‌చాంగ్‌లో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌కి ఉత్తర కొరియా నుంచి దాదాపు 200 మంది చీర్‌లీడర్స్ వచ్చారు.

సహజ సౌందర్యం, ఆకట్టుకునే చిరునవ్వు, చక్కని నృత్యాలతో వీక్షకుల మనసుల్ని వీరు దోచేస్తున్నారు.

అయితే, సాధారణంగా చీర్‌లీడర్స్ చేసే పని వీక్షకులను ఉల్లాసపరచడమే. కానీ, వీళ్లు మాత్రం శత్రువుల మనసుల్ని దోచుకునేలా ప్రదర్శన చేయాల్సి ఉంటుందట!

అందుకోసం మానసికంగా వారిని సిద్ధం చేసి పంపిస్తారని కొన్నేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చిన(డిఫెక్టర్) ఉత్తర కొరియా మాజీ చీర్‌లీడర్ హాన్ సియా- హీ తెలిపారు.

చిరునవ్వుతో శత్రువుల హృదయాల్లోకి చొచ్చుకెళ్లాలన్న విషయాన్ని తమకు శిక్షణలోనే చెప్పేవారని ఆమె వెల్లడించారు.

"ఉత్తర కొరియా సోషలిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయాలని మాకు చెప్పేవారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేవారు" అని ఆమె వివరించారు.

ఇవి కూడా చూండండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)