కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో చికెన్ లేదు!

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో కేఎఫ్‌సీ రెస్టారెంట్లు 900 వరకు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం సగానికి పైగా మూతపడ్డాయి.
కేఎఫ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు సెలవులు తీసుకోవచ్చని ప్రకటించారు.
చికెన్ దొరక్కపోవడంతోనే అవుట్లెట్లను మూసివేశామని కేఎఫ్‌సీ ప్రకటించింది.
సరైన సమయంలో చికెన్ సరఫరా చేయడంలో ఇబ్బందులు వచ్చాయని వివరించింది.
చికెన్ రవాణా కాంట్రాక్టును కేఎఫ్‌సీ గతవారం డీహెచ్ఎల్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు అప్పగించింది.
కానీ చికెన్‌ను సరైన సమయంలో సరఫరా చేయడంలో డీహెచ్ఎల్ విఫలమైందని కేఎఫ్‌సీ తెలిపింది.
డెలివరీ సమస్య పరిష్కారమైందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని కేఎఫ్‌సీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
సమస్యను పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అవుట్లెట్లను తెరుస్తాం. కానీ దానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆయన అన్నారు.
సమీపంలోని ఏ అవుట్లెట్లలో చికెన్ అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు కేఎఫ్‌సీ ఒక వెబ్‌పేజీ తెరిచింది.
గత మంగళవారం వరకు దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్ సంస్థ కేఎఫ్‌సీకి చికెన్ రవాణా చేసేది.
కానీ ఈ కాంట్రాక్టును డీహెచ్ఎల్కు అప్పగించడంతో రవాణా సమస్యలు తలెత్తాయని కేఎఫ్‌సీ తెలిపింది.
బ్రిటన్‌లోని చాలా కేఎఫ్‌సీ అవుట్లెట్లలో చికెన్ ఐటమ్స్ లభించడం లేదు.
దేశవ్యాప్తంగా ఫ్రెష్ చికెన్ తీసుకురావడం సమస్యగా ఉందని, దానికి తామెంతో చింతిస్తున్నామని కేఎఫ్‌సీ ట్వీట్ చేసింది.
నాణ్యత విషయంలో రాజీపడబోం. అందుకే కొన్ని రెస్టారెంట్లను మూసేశాం. మరికొన్ని పరిమితంగా పనిచేస్తున్నాయని కేఎఫ్‌సీ ప్రకటించింది.
ఇంతపెద్ద సమస్య ఉన్నా..కొన్ని రెస్టారెంట్లను తెరిచే ఉంచామని తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
డీహెచ్ఎల్ ఏమంటోంది?
'నిర్వహణపరమైన సమస్యల వల్ల కొన్ని డెలివరీలు పూర్తి చేయలేకపోయాం. మరికొన్ని ఆలస్యం అయ్యాయి' అని డీహెచ్ఎల్ చెబుతోంది.
సమస్య పరిష్కారానికి కేఎఫ్‌సీ, క్యూఎస్ఎల్తో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.
అయితే, రవాణా సంస్థ మార్పు సరికాదని ముందే తాము కేఎఫ్‌సీని హెచ్చరించామని జీఎంబీ యూనియన్ చెప్పింది.
రవాణా సంస్థ మార్పుతో 255మంది ఉద్యోగం కోల్పోయారని, బిడ్వెస్ట్ డిపో మూసేశారని జీఎంబీ యూనియన్ అధికారి మిక్ రిక్స్ తెలిపారు.
కేఎఫ్‌సీ చికెన్ దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
'మేం శనివారం రాత్రి స్థానిక కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కి వెళ్లాం. 20 నిమిషాలు క్యూలో నిల్చున్నాం. మేం కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి చికెన్ లేదన్నారు' అని క్లారా అనే మహిళ బీబీసీ రేడియో 5 లైవ్ షోలో వాపోయారు.
'మా పిల్లలు చికెన్ కావాలని మారాం చేశారు. కానీ అదేమో దొరకడం లేదు. మాకు కావాల్సింది లభించడం లేదు. దాంతో ఉస్సూరుమంటూ వెనక్కు రావాల్సి వచ్చింది' అంటూ చికెన్ ప్రియులు తమ ఆగ్రహాన్ని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- నగ్నత్వాన్నే నిరసన రూపంగా ఆమె ఎందుకు ఎంచుకున్నారు?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..!
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- భారత్‌లో దొరకని భారతీయ వంటకం!
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- కోడళ్ల సంఘం: ఏమిటీ కోడళ్ల ప్రత్యేకత?
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.