వీడియో: నిట్టనిలువు కొండ మీద చర్చికి ఈయన రోజూ ఎలా వెళతారు?

ఆఫీసుకు వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉంటోందని మీరు భావిస్తున్నారా? అయితే.. ఓసారి ఈ వీడియో చూడండి.
ఉత్తర ఇథియోపియాలోని ఓ మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరి మత గురువు ఒకరు ప్రతిరోజూ 250 మీటర్ల ఎత్తయిన కొండ ఎక్కి చర్చికి వెళతారు.
అక్కడికి వెళ్ళి ప్రాచీన మత గ్రంథాలను చదువుకుంటారు.
ఇథియోపియా లో మారుమూల గెరాల్టా పర్వత ప్రాంతంలోని ఓ కాప్టిక్ క్రైస్తవ మతాచార్యులు ప్రతిరోజూ అనితర సాధ్యమైన ప్రయాణం చేస్తుంటారు.
వీడియో: ప్రపంచంలో అత్యంత ఎక్కువ కష్టపడే బాటసారి ఈయనేనా?
‘‘చర్చిని చేరుకోవడానికి పైకి ఎక్కేటపుడు భయం వేయదు. అది నేను రోజూ చేసే పనే. ఇది కష్టమే కానీ, నేను దీన్ని అలవాటు చేసుకున్నాను. నేను తెల్లవారుజామునే లేచి 6 గంటల వరకూ ఇంట్లోనే పని చేసుకుంటా. అప్పటికి నా భోజనం తయారవుతుంది’’ అని ఆయన బీబీసీతో చెప్పారు.
హెయిలే సిలాసి చర్చిని ఓ కొండ చివరన కట్టారు. అది 250 మీటర్ల ఎత్తులో ఉంది.
సెయింట్ అబునా యెమాటా ఈ చర్చిని కట్టించారు. దీని నిర్మాణం 6వ శతాబ్దంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
చర్చికి చేరుకోవడానికి ఆయనకు రెండు గంటలు పడుతుంది. కొండ మీద ఆయన ఎక్కువ సమయాన్ని ప్రాచీన గ్రంథాలు చదవడంలో గడుపుతారు.
పర్వతంలో దాదాపు 10 మీటర్ల వరకు పూర్తిగా నిటారుగా ఉంటుంది. దానిని ఆయన చెప్పులు లేకుండా, కనీసం తాళ్ళు కూడా లేకుండా ఎక్కుతుంటారు.
శతాబ్దాలుగా ఆ చర్చిని నడుపుతున్న మత పెద్దల సమాధులను ఆ కొండ మీదే కట్టారు. ఇప్పటి వరకు, ఎవ్వరూ ఈ కొండ ఎక్కుతూ ప్రమాదవశాత్తు చనిపోలేదు.
‘‘సూర్యాస్తమయానికి చర్చిని మూసేసి ఇంటికి చేరుకుంటా. నేను చర్చి పూజారి అవడానికి కారణం.. నేను నేర్చుకున్నది ఇతరులకి బోధించాలన్న ఆరాటమే. ఆ విధంగా నేను మరికొందరిని నా బాటలో నడిపించవచ్చు’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)