అధ్యయనం: పండ్ల పానీయాలతో పళ్లకు హాని!

ఫ్రూట్ టీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫ్రూట్ టీ వంటి పానీయాల్లో ఉండే యాసిడ్ మీ పళ్లకు హాని చేయగలదు

పులియబెట్టిన లేదా ఆమ్ల గుణం ఉన్న ఫ్లేవర్డ్ నీళ్లు, ఫ్రూట్ స్క్వాష్‌లు తాగటం వల్ల దంతాలు దెబ్బతింటాయి.

వాటిలో ఉండే యాసిడ్ దంతాలు ఊడిపోయేలా చేయగలదని లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో తెలిపారు.

పండ్ల రుచులున్న నీళ్లు, టీ, డైట్ డ్రింకులు, చక్కెర కలిపిన పానీయాలు తరచుగా తాగటం వల్ల, నిల్వ చేసిన పండ్ల గుజ్జు తినటం వల్ల ఈ ప్రమాదం ఉంటుందని వెల్లడించారు.

సాధారణంగా ఈ పానీయాలను చాలా తీరుబడిగా తాగుతుంటాం. అది మరింత ప్రమాదమని లండన్ కింగ్స్ కాలేజ్ డెంటల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ సయొర్సె ఒ'టూలే చెప్పారు.

‘‘ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సేపు ఈ డ్రింకుల్ని తాగినా, పండ్లను వెంటనే తినకుండా, కొంచెం కొంచెం నములుతూ, నోట్లో ఎక్కువసేపు పెట్టుకుని తిన్నా మీ పళ్లు పాడవుతాయి’’ అని డాక్టర్ సయొర్సె తెలిపారు.

‘‘ఒకవేళ మీరు మధ్యాహ్న భోజన సమయంలో ఆపిల్‌ను తింటే, ఆ తర్వాత మళ్లీ ఆమ్ల గుణాలున్నవి ఏవీ తినకండి’’ అని సలహా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

''ఐదు నిమిషాలకు మించి ఎక్కువ సేపు ఈ డ్రింకుల్ని తాగినా, పండ్లను నోట్లో ఎక్కువసేపు పెట్టుకుని తిన్నా మీ పళ్లు పాడవుతాయి''

ఆమ్ల గుణాలున్న పానీయాలేంటి?

  • ఫ్రూట్ టీ
  • ఫ్లేవర్డ్ వాటర్
  • పండ్ల గుజ్జు
  • డైట్ డ్రింకులు
  • తీపి పానీయాలు

ఆమ్ల గుణాలు లేనివి ఏంటి?

  • నీళ్లు
  • టీ
  • కాఫీ
  • పాలు
  • సోడా నీళ్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)