ఈ వీడియో చూస్తే ఇక ఎన్నడూ ఆహారం వృధా చేయరు!

పగ్ పగ్

దీన్ని పగ్‌..పగ్‌ అని పిలుస్తారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఇది ఎక్కువగా దొరుకుతుంది.

మురికివాడల్లోని పేదలకు ఇది బిర్యానీతో సమానం.

మాంసాహారం కొనుగోలు చేసే ఆర్ధిక స్థోమత లేని వారు ఈ పగ్..పగ్‌ తింటారు.

పగ్‌ పగ్ కూడా మాంసాహారమే. కానీ దీన్ని తయారు చేసే విధానం చూస్తేనే అమ్మో అనిపిస్తుంది.

వీడియో క్యాప్షన్,

పగ్ పగ్ ఎలా తయారు చేస్తారో మీరూ చూడండి

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు మిగిలిపోయిన చికెన్ ముక్కలు, ఆహార వ్యర్థాలను చెత్తకుండిల్లో పడేస్తాయి.

వాటిని కొందరు సేకరించి పగ్‌ పగ్ హోటల్ నడిపే వారికి విక్రయిస్తారు.

అక్కడ చికెన్ వ్యర్థాలను శుభ్రం చేసి, ఎముకలను వేరు చేసి, మసాల దట్టించి పగ్ పగ్ తయారు చేస్తారు.

పగ్‌..పగ్‌ అంటే ఫిలిప్పీన్ భాషలో 'మురికిని తీసేయ్' అని అర్ధం.

ఇలా వండిన పగ్ పగ్‌ను పేదలు కొనుగోలు చేస్తారు.

బీబీసీ ప్రతినిధులు ఈ ప్రక్రియను మొత్తం చిత్రీకరించారు.

మీరివి చదివారా?

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.