ది బ్లాక్ మాంబా: పడి లేచిన కెరటం!
దక్షిణాఫ్రికాకు చెందిన రొనాల్డ్ డ్లామినీ ఒక పడి లేచిన కెరటం. మెనింజైటిస్ వ్యాధి వల్ల చూపు కోల్పోయిన ఈ బాక్సింగ్ ఛాంపియన్ తనలాగే చూపు లేని వారికి ఆత్మరక్షణ పాఠాలు చెబుతూ జీవితంలో గెలుస్తున్నారు.
కంటి చూపు లేనప్పుడు ధ్యాస అంతా శబ్దాన్నివినడం, వాసన పసిగట్టడం మీదే ఉంటుంది.
ఆయనిలా అంటున్నారు:
నా పేరు రొనాల్డ్ "ది బ్లాక్ మాంబా" డ్లామినీ.
న్యూజిలాండ్ దేశంలో జరిగిన నా చివరి ఫైట్‌లో గెలిచాను. స్వదేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చాక నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది. అది తరచుగా వస్తూ పోతూ ఉండేది.
డాక్టర్‌కు చూపించుకుంటే నాకు మెనింజైటిస్ వ్యాధి ఉందని నిర్ధారించారు. పది రోజులు కోమాలో ఉన్నాను. స్పృహలోకి వచ్చిన తరువాత కంటిచూపు పూర్తిగా కోల్పోయాను.
నాకు మతిపోయినట్లయింది. ఏం చేయాలో తెలియలేదు. నేనసలు ఎవరినో కూడా నాకు అర్థం కాలేదు. ఆ దేవుడే ఇలా చేశాడని నిందిస్తూ దుఃఖించాను.
కానీ, ఇపుడు నేను నాలా చూపులేని వారికి ఉండేందుకు సహాయపడుతున్నాను. ఏదైనా ప్రమాదం ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తున్నాను.
ఇవి చదివారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)