ప్రపంచంలో ఈ భాష ముగ్గురే మాట్లాడతారు!

తమతో పాటు బదేశీ భాష కూడా చనిపోతుందని ఈ ముగ్గురు ఆందోళన చెందుతున్నారు
ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు మాట్లాడే భాషలోని కొన్ని పదాలు నేర్చుకుంటారా?
'బదేశీ' భాషను ఉత్తర పాకిస్తాన్లోని కొండప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడేవారు.
గతంలో ఈ భాష మాట్లాడే వారి సంఖ్య అధికంగానే ఉండేది.
బదేశీ భాష అంతరించిపోవడానికి కారణాలేంటి?
ప్రస్తుతం ఈ భాష అంతరించిపోతోంది.
ఈ భాష అంతరించిపోవడానికి ఇతర ప్రాంతాల అమ్మాయిలను వివాహం చేసుకోవడమే కారణమని అక్కడి పెద్దలు చెబుతున్నారు.
'బదేశీ' భాషకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి.
ప్రస్తుతం బదేశీ భాషను కాపాడటం కష్టమే.
కానీ మీకు ఆసక్తి ఉంటే కొన్ని పదాలు నేర్చుకోండి.
మీన్ నావో రహీమ్ గుల్ తీ -నా పేరు రహీమ్ గుల్
మీన్ బదేశీ జిబీ ఆసా - నేను బదేశీ మాట్లాడతా
తీన్ హాల్ ఖాలే థీ - ఎలా ఉన్నారు?
మే గ్రోట్ ఖేక్తి- నేను తిన్నాను.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)