మూడు వార్తలు: ఏకపరమాణువు, జపాన్ లైంగిక బానిస, పాకిస్తాన్ సంప్రదాయ సంగీతం

మూడు వార్తలు: ఏకపరమాణువు, జపాన్ లైంగిక బానిస, పాకిస్తాన్ సంప్రదాయ సంగీతం

కాస్త జాగ్రత్తగా గమనించండి. పీలగా, ఊదా రంగు పిక్సెల్ రెండు సూదుల మధ్య ఉన్న నలుపు రంగు క్షేత్రంలో కనిపిస్తుంది కదా. అది ఏక పరమాణువు చిత్రం.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్ది డేవిడ్ నడ్ లింగర్ ఒక సాధారణ డిజిటల్ కేమెరాతో ఈ ఫోటో తీశారు.

ఇలాంటి చిత్రాలు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఇతరులకు ఆసక్తిని కలిగిస్తాయని డేవిడ్ ఆశిస్తున్నారు.

దక్షిణ కొరియాలో సజీవంగా ఉన్న 31 మంది లైంగిక బానిసల్లో 92 ఏళ్ల లీ ఓక్ సన్ ఒకరు. 1942లో జపాన్ సైన్యం ఆమెను చైనాకు ఎత్తుకు పోయింది. అక్కడ ఆమెను లైంగిక బానిసగా మార్చివేశారు. దక్షిణ కొరియాలో ఆమె మరణించినట్లుగా నమోదు చేశారు. కానీ యుద్ధం ముగిసిన తరువాత న్యాయపోరాటం చేసి తన పౌరసత్వాన్ని ఆమె తిరిగి పొందారు. నాడు చేసిన అన్యాయానికి జపాన్ ప్రభుత్వం అధికారికంగా క్షమాపణ చెప్పాలని లీ డిమాండు చేస్తున్నారు.

లైంగిక బానిసలు అందరూ చనిపోయిన తరువాతైనా ఈ సమమస్య పరిష్కారం కావాలని ఆమె కోరుకుంటున్నారు.

పాకిస్తాన్‌లోని సంప్రదాయ సంగీతకారులు తమ కళ అంతరించిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్‌ సాంకేతికత మోజులోపడి యువత.. జానపద సంగీతాన్ని మరిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ కళలను సజీవంగా ఉంచాలని ప్రయత్నిస్తున్న వారిలో అబ్దుల్లా ఖాన్ ఒకరు. అయితే ఈ ప్రయత్నంలో తాను ఓడిపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఎలక్ట్రానిక్ కీ బోర్డు.. అయిదు సంప్రదాయ సంగీత వాద్యాలను మేళవించి.. ఎలా స్వరాలు పలికించగలదో అబ్దుల్లా వివరిస్తున్నారు. అలాంటి సాంకేతికతతో తాము పోటీపడలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)