నైజీరియా: 110 మంది అమ్మాయిల్ని అపహరించిన బోకోహరాం జీహాదీలు
నైజీరియాలో 110 మంది పాఠశాల విద్యార్థినులు కిడ్నాప్‌కు గురై పది రోజుల పైనే అయింది. కానీ, ఇంతవరకూ వారి ఆచూకీ తెలియలేదు.
దాప్చి పాఠశాల మీద దాడి చేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బొకొహరాం జిహాదీలేనని అనుమానిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన సమయంలో తప్పించుకున్న అమ్మాయిల్లో ఒకరితో బీబీసీ మాట్లాడి అందిస్తున్న ప్రత్యేక కథనం.
పది రోజులు దాటినా.. నైజీరియా విద్యార్థినుల జాడ తెలియలేదు. దాప్చి పాఠశాలపై దాడి జరిగిన తరువాత పరిస్థితులు గందరగోళంగా మారాయి.
అధికారులు కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ అసలు ఏం జరిగిందో అర్థమవుతోంది.
బొకొహరాం జిహాదీలుగా భావిస్తున్న కొంత మంది సాయుధులు నైజీరియాలోని దాప్చి పాఠశాలపై దాడి చేసి, అమ్మాయిలను ట్రక్కుల్లో ఎక్కించుకు పోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారిలో ఓ అమ్మాయి తప్పించుకోలిగింది.
దాడి జరగడానికి ఒక రోజు ముందు.. పాఠశాలకు సమీపంలోని చెక్ పోస్టుల వద్ద సైనికులను.. సైన్యం వెనక్కి పిలిచింది. మహిళా కళాశాల, పాఠశాల ఉండే దాప్చి ప్రాంగణంలో దాదాపు వెయ్యి మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు.
అమ్మాయిల అపహరణకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నైజీరియా అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
కిడ్నాప్ జరిగిన దాప్చి కళాశాల, పాఠశాల ప్రాంగణం
ఆ అమ్మాయిల కుటుంబాలు మాత్రం వారి నుంచి కబురు కోసం ఎదురుచూస్తున్నాయి.
చిబొక్ పాఠశాల.. దాప్చికి 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2014లో ఈ పాఠశాల నుంచి 276 మంది అమ్మాయిలను బొకోహరాం అపహరించింది.
వారిని విడిపించేందుకు ఆనాడు అంతర్జాతీయంగా పెద్ద ఉద్యమం జరిగింది. నాలుగేళ్లు దాటినా వారిలో 100 మంది జాడ ఇంకా తెలియలేదు.
ఇప్పుడు మరోసారి అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. మరి గతంలో జరిగిన దారుణం నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)