జపాన్ ఎలక్ట్రిక్ మరుగుదొడ్ల గుర్తుకు అంతర్జాతీయ గుర్తింపు!

  • 5 మార్చి 2018
జపనీస్ ఎలక్ట్రిక్ మరుగుదొడ్ల సంజ్ఞలు Image copyright Japan Sanitary Equipment Industry Association
చిత్రం శీర్షిక (ఎడమ నుంచి కుడి వైపుకు) ఫ్లఫ్ చేయండి, తక్కువ నీటితో ఫ్లష్ చేయడం, వెనక నుంచి శుభ్రం చేసుకోవడం, ముందు నుంచి శుభ్రం చేసుకోవడం, కమోడ్ తలుపులు మూయడం, కమోడ్ సీటు తెరవడం

ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను వాడే విధానాన్ని సంజ్ఞల రూపంలో పొందుపరిచిన ఓ చిత్రాన్ని జపాన్ రూపొందించింది. ఈ గుర్తుకు ‘అంతర్జాతీయ ప్రమాణం’గా గుర్తింపు లభించింది.

ఇకపై.. ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను వాడే ప్రతి చోటా ఈ గుర్తు కనిపిస్తుంది.

ఈ గుర్తులో మొత్తం ఆరు సంజ్ఞలు ఉంటాయి. వీటి ఆధారంగా ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను ఏవిధంగా వాడాలో వినియోగదారులకు సులువుగా అర్థమవుతుందని, అందుకే ఈ గుర్తును అంతర్జాతీయ స్టాండర్జైజేషన్ సంస్థ ఆమోదించిందని జపాన్‌లోని ‘క్యుడో’ వార్తా సంస్థ పేర్కొంది.

2020లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు పెద్ద సంఖ్యలో విదేశీ పర్యటకులు రానున్న నేపథ్యంలో ఈ గుర్తును తయారు చేసినట్టు.. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలక్ట్రిక్ మరుగుదొడ్ల వాడకం తెలీక పర్యటకులు అయోమయం చెందే అవకాశం ఉందని, ఈ సంజ్ఞలతో.. ఆ మరుగుదొడ్లను ఎలా వాడాలో అర్థమైపోతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.

జపాన్ శానిటరీ ఇండస్ట్రీ అసోసియేషన్.. గత సంవత్సరంలో ఈ సంజ్ఞలను రూపొందించింది. అంతకు ముందే.. తయారీదారులు కూడా తమ ఉత్పత్తులపై వీటిని ముద్రించేందుకు అంగీకరించారు.

Image copyright Japan Sanitary Equipment Industry Association

''ఈ సంజ్ఞలతో ఎవరైనా ఎలక్ట్రిక్ మరుగుదొడ్లను పూర్తి విశ్వాసంతో వాడొచ్చు'' అని శానిటరీ ఇండస్ట్రీ అసోసియేషన్ తెలిపింది.

ఈ సంజ్ఞలను మరుగుదొడ్లపై ముద్రించడం ద్వారా వీటి అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్ తెలిపింది.

ఈ ఎలక్ట్రిక్ మరుగుదొడ్లలో.. ఈ మరుగుదొడ్లను వేడి నీళ్లతో ఫ్లఫ్ చేసే విధానం, వాడకం పూర్తయ్యాక కమోడ్ మూతలు ఆటోమెటిక్‌గా మూతపడే సౌకర్యాలున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)