ప్రపంచ వార్తలు: 4 ముఖ్యాంశాలు

  • 4 మార్చి 2018
Image copyright (C) British Broadcasting Corporation

జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వం

జర్మనీ దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్‌తో కలసి అధికారంలో కొనసాగేందుకు ప్రతిపక్ష సోషల్ డెమొక్రాట్లు అంగీకరించారు. దీంతో నాలుగోసారి మెర్కెల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో అప్పటి నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది. దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వంలో చేరుతున్నామని ఎస్‌పీడీ ప్రకటించగా, ప్రభుత్వంలో చేరాలన్న వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మెర్కెల్ ప్రకటించారు.

ఇటలీ ఎన్నికలు

ఇటలీ దేశ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నారు. వలస, నిరుద్యోగం మొదలైన అంశాలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో స్పష్టంగా చెప్పలేమని స్థానిక బీబీసీ ప్రతినిధులు తెలిపారు.

దేశానికి నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన 81 ఏళ్ల సిల్వియో బెర్లుస్కోనీ ఆధ్వర్యంలోని అతివాద కూటమికే అధిక సీట్లు వస్తాయని, కానీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చునని సర్వేలు చెబుతున్నాయి.

ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా అధికారులు

దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యేక అధికారిక బృందం ఉత్తర కొరియాలో పర్యటించనుంది.

15 మంది ఉన్నతాధికారులతో కూడిన ఈ బృందానికి దక్షిణ కొరియా జాతీయ భద్రతా సంస్థ ఛీఫ్ యూన్ యంగ్ చాన్ నేతృత్వం వహిస్తారు. సోమవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్న ఈ బృందం ఒక రాత్రి అక్కడే బస చేయనుంది.

అణ్వాయుధీకరణను నిరోధించటం, ఉభయ కొరియాల మధ్య చర్చల వాతావరణాన్ని పెంపొందించటం మొదలైన అంశాలపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.

ఆస్కార్ అవార్డుల వేడుక

90వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో (అమెరికా కాలమానం ప్రకారం) ఆదివారం సాయంత్రం జరుగనుంది.

ఆస్కార్ వేడుకకు రెడ్‌కార్పెట్‌ సిద్ధమైంది.

హాలీవుడ్ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ అవార్డుల కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నట్లు నిర్వాహకులు ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు

'వీర్యదాత చట్టపరంగా తండ్రి': కోర్టు తీర్పు