చైనా-తైవాన్: అంత్యక్రియల్లో అశ్లీల నృత్యాలు ఎందుకు చేస్తారు?
- ఇవెట్టి టాన్
- బీబీసీ న్యూస్

ఫొటో సోర్స్, Getty Images
శవయాత్రలో అశ్లీల, అసభ్య నృత్యాలు చేయడం చైనాలోని కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది.
ఎన్నో ఏళ్లుగా ఇది వారికి ఆచారంగా వస్తోంది. శవయాత్ర సందర్భంగా ఇప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శవయాత్రలు, పెళ్లిళ్లు, ఆలయ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు చేయడాన్ని ఈ ఏడాది ప్రారంభంలో చైనా నిషేధించింది.
కానీ ప్రజలు మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఫొటో సోర్స్, AFP/Getty Images
శవయాత్రలో అశ్లీల నృత్యాలు ఎందుకు?
అంత్యక్రియల్లో చాలా మంది పాల్గొనేలా అందర్ని ఆకర్షించేందుకు ఇలాంటి అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తారని ఒక కథనం ప్రచారంలో ఉంది.
అంత్యక్రియల్లో ఎంత ఎక్కువ మంది పాల్గొంటే చనిపోయిన వ్యక్తికి అంత గౌరవం ఇచ్చినట్లు అని అక్కడి ప్రజలు భావిస్తారు.
ఇది మానవ ప్రత్యుత్పత్తి ప్రక్రియను ఆరాధించడమని మరికొందరు చెబుతుంటారు.
'స్థానిక ఆచారాల ప్రకారం అంత్యక్రియల్లో శృంగార డాన్సర్లతో నృత్యం చేయించడమంటే చనిపోయిన వ్యక్తి దీవెనలు అతని బంధువులకు అందించడం' అని ఫుజియాన్ నార్మన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హువాంగ్ జియాంగ్సింగ్ గ్లోబల్ టైమ్స్ వార్తా సంస్థకు చెప్పారు.
వాస్తవానికి తమ హోదా, అంతస్తు ప్రదర్శించడం కోసమే ఇలాంటి అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తారని మరికొందరు చెబుతున్నారు.
ఫొటో సోర్స్, AFP/Getty Images
చైనాలో ఈ ఆచారం మామూలేనా?
చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆచారం ఎక్కువగా ఉంది. కానీ తైవాన్లో ఇది మరింత ఎక్కువ. నిజానికి ఇది అక్కడే పుట్టింది.
1980ల్లో అంత్యక్రియల సమయంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడమనేది తైవాన్లో విస్తృత ప్రాచుర్యం పొందిందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా ఆంత్రోపాలజిస్ట్ మార్క్ మోస్కోవిట్జ్ బీబీసీకి చెప్పారు.
తైవాన్లో ఇది సర్వసాధారణం. కానీ చైనాలో ప్రభుత్వ నియంత్రణ అధికంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది చైనీయులు ఈ సంప్రదాయం గురించి విని ఉండరు.
అయితే, తైవాన్లో కూడా ప్రధాన పట్టణాల్లో ఈ సంప్రదాయం అంతగా కనిపించదు.
ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి నగర శివార్లలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారని మోస్కోవిట్జ్ తెలిపారు.
గతేడాది తైవాన్ చియాయి పట్టణంలో ఒక రాజకీయ నాయకుడి శవయాత్రలో 50 మంది పోల్ డాన్సర్లు జీప్ టాప్
ఇప్పుడు నియంత్రణ ఎందుకు?
చైనా ప్రభుత్వ తాజా నియంత్రణ చర్యలు కొత్తేమీ కాదు.
అంత్యక్రియల సందర్భంగా అసభ్య నృత్యాలు చేయకుండా ప్రజలను చైతన్య పరచాలన్న ప్రచారంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
ఇలాంటి నృత్యాలు అనాగరికమని చైనా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చెబుతోంది.
ఎవరైనా డాన్సర్లను తీసుకొచ్చి శవయాత్రలో నృత్యాలు చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కానీ ఈ సంప్రదాయం నుంచి బయటపడటం అంత సులువు కాదని ఆంత్రోపాలజిస్ట్ మార్క్ మోస్కోవిట్జ్ చెప్పారు.
చట్టవ్యతిరేకమని ప్రభుత్వం చెబుతున్నా మారేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
2006, 2015లో అశ్లీల నృత్యాల నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ సంప్రదాయం పూర్తిగా కనుమరుగవుతుందా? లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
అయితే, ఈ ఆచారం పూర్తిగా అంతమయ్యే వరకు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.