ప్రపంచ వార్తలు: 4 ముఖ్యాంశాలు

  • 5 మార్చి 2018
Image copyright (C) British Broadcasting Corporation

శాశ్వతంగా అధికారంలో షీ జిన్ పింగ్

దేశాధ్యక్షుడు పదవిలో కొనసాగేందుకు ఉన్న కాల పరిమితుల్ని రద్దు చేసే అంశంపై చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతినిధులు చర్చిస్తున్నారు.

అంటే.. షీ జిన్ పింగ్ శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు అవకాశం కల్పించటం.

ఈ సమావేశాలు బీజింగ్‌లో జరుగుతున్నాయి.

ఇటలీలో ప్రభుత్వ ఏర్పాటుకు సంప్రదింపులు

‘ప్రభుత్వ వ్యతిరేక’ పార్టీలు రెండు ఇటలీని పాలించటానికి తమకే హక్కు ఉందంటున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని వారాల సంప్రదింపులు అవసరం కావొచ్చునని లెగ ఛీఫ్ మాట్టియొ సల్విని, ప్రజాకర్షక ఫైవ్‌స్టార్ మూవ్‌మెంట్ నాయకుడు లూగీ డీ మీయోలు ప్రకటించారు.

కిమ్‌ జోంగ్ ఉన్‌తో దక్షిణ కొరియా బృందం భేటీ

దక్షిణకొరియా ఉన్నతాధికారులతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సమావేశమయ్యారు.

2011లో కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దక్షిణ కొరియా అధికారిక బృందం ఆయనతో భేటీ కావటం ఇదే తొలిసారి.

సిరియాలో ఐక్యరాజ్య సమితి సహాయ వాహనాలు

సిరియాలో రెబల్స్ ఆధిపత్యంలో ఉన్న తూర్పు ఘూటాకు ఐక్యరాజ్య సమితికి చెందిన 46 సహాయ వాహనాలు చేరుకున్నాయి.

గత నెలలో ప్రభుత్వం ఈ ప్రాంతంపై దాడుల్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)