ఇక కోకా కోలా మద్యం

  • 8 మార్చి 2018
కోకా కోలా, జపాన్, అల్కాహాలిక్ డ్రింక్ Image copyright AFP/Getty Images

తన 125 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా కోకా కోలా అల్కాహాలిక్ డ్రింక్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

జపాన్‌లో స్థానికంగా లభించే 'షోచు' అనే స్పిరిట్‌తో తయారు చేసే చు-హి అనే క్యాన్డ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ బాగా అమ్ముడుపోతున్న నేపథ్యంలో కోకా కోలా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డ్రింక్‌లో 3 నుంచి 8 శాతం అల్కాహాల్ ఉండే అవకాశం ఉంది.

వీటిని అల్కోపాప్ అని పిలుస్తారు. హూచ్, రీఫ్, స్మిర్నాఫ్ ఐస్, బకార్డీ బ్రీజర్ లాంటివి అల్కోపాప్ కిందకు వస్తాయి.

Image copyright Getty Images

''గతంలో తక్కువ అల్కాహాల్ విభాగంలో మేం ఎప్పుడూ ఈ ప్రయోగం చేయలేదు. అయితే కొత్త ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషించడానికి ఇదో మంచి మార్గం'' అని కోకా కోలా జపాన్ అధ్యక్షుడు జోర్జ్ గార్డునో తెలిపారు.

దీనిని జపాన్ బయట విక్రయించే ఆలోచనేదీ లేదని అన్నారు.

జపాన్‌లో ఇలాంటి డ్రింకులకు బాగా డిమాండ్ ఉంది. బీర్‌కు ప్రత్యామ్నాయంగా ఈ డ్రింకులను విక్రయిస్తున్నారు. మరీ ప్రత్యేకించి జపాన్ మహిళల్లో ఇది బాగా పాపులర్.

వీటిని ద్రాక్ష, నిమ్మతో చేస్తారు. ఆపిల్, పీచ్ ఫ్లేవర్లతో కూడా వీటిని తయారు చేయొచ్చు.

Image copyright Getty Images

ఇటీవల యువ వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరుగుతుండడంతో కోకా కోలా ఫిజ్జీ డ్రింక్‌ల నుంచి ఇతర డ్రింక్‌ల వైపు దృష్టి సారిస్తోంది. ఇటీవల కొన్ని వాటర్, టీ బ్రాండ్లను కూడా కొనుగోలు చేసింది.

అయితే తియ్యగా ఉండే అల్కోపాప్ డ్రింకులను సులభంగా తాగే అవకాశం ఉండడం వల్ల యువత దాని వైపు ఎక్కువగా ఆకర్షితమవుతోంది. అందువల్ల ఇలాంటి డ్రింకులపై జపాన్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)