కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!

  • 9 మార్చి 2018
బీబీసీ ప్రతినిధి వ్లాదిమిర్

పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా వెనెజువెలా దేశ కరెన్సీ అయిన బొలివర్‌కు దాదాపు విలువ లేకుండా పోయింది. దీంతో ఏదైనా కొనాలంటే ఎక్కువ మొత్తంలో కరెన్సీ నోట్లను ఉపయోగించాల్సి వస్తోంది.

దీనివల్ల దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లకు కొరత ఏర్పడింది. డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల బయట బారులు తీరుతున్నారు. కానీ బ్యాంకుల్లో కూడా సరిపడా డబ్బు లేదు.

ఇదే అదనుగా కొందరు కరెన్సీని అమ్మడాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కరెన్సీ కావల్సిన వాళ్లు సోషల్ మీడియా ద్వారా వ్యాపారులను సంప్రదిస్తున్నారు. వాళ్లు కొంత ఫీజు తీసుకొని కస్టమర్లకు కరెన్సీని అమ్ముతున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి

ఆ పరిస్థితిని కళ్లకు కట్టేందుకు బీబీసీ ప్రతినిధి వ్లాదిమిర్ ప్రయత్నించారు. (పై వీడియో చూడండి)

తన దగ్గర ఉన్న డబ్బుతో పదిహేనేళ్ల క్రితం ఓ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ వచ్చేదనీ, కానీ ఇప్పుడు ఒక కప్పు కాఫీ మాత్రమే దొరకుతోందని వ్లాదిమిర్ చెబుతారు.

అక్కడ ఒక మనిషి రోజువారీ కార్యకలాపాల కోసం ఒక బస్తా డబ్బు కావాలని ఆయన అంటారు.

వెనెజువెలాలో భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో పాటు ప్రభుత్వ నిర్వహణ లోపం కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరింది.

ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తమపై పడిందని ఆరోపిస్తోంది.

ఈ ఏడాది వెనెజువెలాలో ద్రవ్యోల్బణం 13000 శాతానికి చేరొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

రాయల్‌ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..

#100WOMEN: ‘మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది’

బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్