ట్రంప్-కిమ్: గతంలో ఇలా తిట్టుకున్నారు

  • 9 మార్చి 2018

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌‌ను కలిసి మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వాళ్లిద్దరూ స్నేహపూర్వక బంధం దిశగా అడుగేస్తున్నా, గతంలో వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు, అవమానాలు కూడా తెరమీదకొస్తున్నాయి.

‘రాకెట్‌మ్యాన్’, ‘డొటార్డ్’(ముసలివాడు).. లాంటి పదాలతో గతంలో ఒకరికొకరు తిట్టుకున్నారు.

గత సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ ‘డొటార్డ్’ అని ట్రంప్‌ని ఉద్దేశిస్తూ ఓ ప్రసంగంలో అన్నారు. ఆ మాట ఏంటో అర్థం కాక చాలామంది డిక్షనరీలను వెతుకున్నారు. దానర్థం ‘మానసికంగా, శారీరకంగా వృద్ధుడైన వ్యక్తి’ అని తెలుసుకొని అంతా అవాక్కయ్యారు.

Image copyright Twitter

ట్రంప్‌ గతేడాది ఐక్య రాజ్య సమితి సమావేశంలో చేసిన ప్రసంగానికి కిమ్ స్పందిస్తూ, ‘అతడు ఏదో ఒక రోజు ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తాడు’ అన్నారు.

తమ అధ్యక్షుడే ట్రంప్‌ను అంత మాట అనడంతో ఉత్తర కొరియా మీడియా మరో అడుగు ముందుకేసింది. ‘విషపూరిత పుట్టగొడుగు’, ‘పురుగు’, ‘గ్యాంగ్‌స్టర్’, ‘దోపిడీదారుడు’, ‘డొటార్డ్’, ‘ర్యాబిస్ కుక్క’, ‘ల్యునాటిక్’ లాంటి పదాలను ప్రయోగిస్తూ ట్రంప్‌పై ఉ.కొరియా మీడియా విరుచుకుపడింది.

ఉత్తర కొరియాలో కిమ్‌ని గానీ, అతడి కుటుంబ సభ్యుల్ని గానీ ఎవరైనా తిడితే వారికి మరణ శిక్ష విధిస్తారు.

Image copyright Korean Central News Agency

‘ట్రంప్ పొలంలో ఓ పురుగు, ఓ విషం నిండిన పుట్టగొడుగు, మానసిక సమస్యతో ఉన్న ముసలివాడు’ అని ఉత్తర కొరియాకు చెందిన కేసీఎన్‌ఏ అనే న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

‘అతడెన్నో లోపాలతో నిండిన మనిషి, ఓ రాజకీయ పోకిరి, దోపిడీదారు, మానసికంగా ఎదగని వ్యక్తి’ అని గత సెప్టెంబర్ 23న ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక ‘రోడొంగ్ సిన్మన్’ రాసుకొచ్చింది.

‘ముసలివాడు’ అంటూ తనను ఉద్దేశిస్తూ ఉత్తర కొరియా మీడియా చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ ‌కూడా స్పందించారు. ‘నేనెప్పుడైనా కిమ్‌ని పొట్టివాడు, దొబ్బోడు అని అన్నానా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Image copyright Twitter

ట్రంప్ గతంలో తన దగ్గర కూడా న్యూక్లియర్ బటన్ ఉందని ట్వీట్ చేసినప్పుడు, ‘రోడంగ్ సిన్మన్’ పత్రిక ఘాటైన వ్యాఖ్యాలు చేసింది. ‘సైకోపాత్’, ‘నిర్ల‌క్ష్యం నిండిన వెర్రివాడు’, ‘లూజర్’ అని ప్రచురించింది. అతడి వ్యాఖ్యలను ర్యాబిస్‌తో బాధపడే కుక్క అరుపులతో పోల్చింది.

ట్రంప్ మానసిక పరిస్థితి ప్రపంచానికి పెద్ద తలనొప్పిలా మారిందనీ, అమెరికా న్యూక్లియర్ బటన్ ఓ పిచ్చివాడి చేతిలో ఉందనీ ‘రోడంగ్ సిన్మన్’ పేర్కొంది.

‘అతడు మనిషి కాదు, ఓ గ్యాంగ్‌స్టర్ల నాయకుడు, ఓ కుక్క’ అని కేసీఎన్‌ఏ వ్యాఖ్యానించింది.

ఇలాంటి పరిణామాల అనంతరం ట్రంప్, కిమ్‌ కలుసుకోవడానికి ఒప్పుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరి వాళ్లిద్దరూ మే నెలలో ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు ఎలా మాట్లాడుకుంటారో చూడాలి.

(ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో, వెబ్, ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలను, నివేదికలను బీబీసీ మానిటరింగ్ విశ్లేషిస్తుంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లలో బీబీసీ మానిటరింగ్‌ను అనుసరించొచ్చు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

సుజనా చౌదరి మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఏమిటి

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు