పుతిన్‌ను సవాల్‌ చేస్తున్న మహిళా జర్నలిస్టు!

  • 11 మార్చి 2018
పుతిన్‌పై మహిళా పోటీ Image copyright AFP/EPA

రష్యాలో పుతిన్‌‌ను ఢీకొట్టబోతున్నారు..ఒక మహిళా జర్నలిస్టు.

ఆమె పేరు క్సేనియా సబ్చక్.. రష్యాలో క్సేనియా సెలబ్రిటీ. టీవీలో రాజకీయ చర్చా వేదిక వ్యాఖ్యాత.

ఎన్నికల్లో పుతినే గెలుస్తారని ఆమె చెబుతున్నారు. మరెందుకు ఆమె పుతిన్‌పై పోటీ చేస్తున్నారు?

క్సేనియా పోటీ చేయడం వెనక పుతిన్ వ్యతిరేక వర్గం కుట్ర దాగి ఉందని ఆయన అనుకూల వర్గం చెబుతోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption'అధికారం కోసం కాదు.. ప్రజల ఆకాంక్షలు తెలిపేందుకే నా ప్రయత్నం'

అయితే, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని క్సేనియా అన్నారు.

పుతిన్‌ అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆమె చెప్పారు.

అధికారం కోసం కాదు.. ప్రజల ఆకాంక్షలు అందరికీ తెలిసేలా చేసేందుకే తాను పోటీ చేస్తున్నట్లు ఆమె బీబీసీకి చెప్పారు.

తనకు పడే ఓట్లను పుతిన్‌ పాలనకు వ్యతిరేకంగా వచ్చినవిగా భావించాలని విజ్ఞప్తి చేశారు.

నిజానికి 1990లో ఆమె తండ్రి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ మేయర్‌గా ఉన్నప్పుడు పుతిన్ ఆయన కోసం పని చేశారు.

ఇవి కూడా చదవండి:

ఈ కథనం గురించి మరింత సమాచారం