భారతీయ హింగ్లిష్.. ఇప్పుడు యూకే కాలేజీ కోర్సు

  • 15 మార్చి 2018
హింగ్లిష్

ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లిష్ మాట్లాడే దేశాల జాబితాలో భారత్‌ది రెండో స్థానం. కానీ భారత్‌లో ‘ఇంగ్లిష్’ కంటే ‘హింగ్లిష్‌’నే ఎక్కువగా మాట్లాడతారు. హిందీ పదాల్నీ ఇంగ్లిష్ పదాల్నీ కలిపితే పుట్టిన భాషే హింగ్లిష్.

ఇప్పుడు ఈ హింగ్లిష్ భాషకు యూకే కూడా ప్రాధాన్యం ఇస్తోంది. అక్కడి పోర్ట్స్ మౌత్ కాలేజీలో తొలిసారిగా హింగ్లిష్ కోర్సును మొదలుపెట్టారు. ప్రస్తుతం తొలి బ్యాచ్ విద్యార్థులు హింగ్లిష్ పాఠాలు నేర్చుకుంటున్నారు.

భారత్‌కు ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో హిందీపై ఇంగ్లిష్ ప్రభావం పడిందనీ, ఫలితంగా ఎన్నో కొత్త పదాలు పుట్టుకొచ్చాయనీ చెబుతారు. ఆంటీజీ-అంకుల్‌జీ, కజిన్ బ్రదర్-కజిన్ సిస్టర్, బ్రిటిష్ రాజ్, హమారీ ట్రీట్, ఎంజాయ్ కరే లాంటి పదాలు అలా వచ్చినవే. ప్రాచుర్యం పొందిన టీవీ ప్రకటన స్లోగన్ ‘యే దిల్ మాంగే మోర్’ కూడా హింగ్లిష్‌కి ఓ ఉదాహరణ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇంగ్లిష్ ఒకే..మరి హింగ్లిష్ తెలుసా?

భారత్‌లో హింగ్లిష్ ఓ వ్యాపార భాషలా మారిపోయింది. ప్రపంచంలో భారత్ ఏడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడికి రావాలనుకునేవారు కూడా హింగ్లిష్‌పైన అవగాహన పెంచుకోవడం అవసరమని భావిస్తున్నారు.

‘భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారు. వాటిల్లో పాటలు, మాటల్లో హింగ్లిష్ వినిపించడం మామూలైపోయింది’ అంటారు యూకేలో హింగ్లిష్ పాఠాలు బోధిస్తున్న విరాజ్ షా.

ఇది వింటుంటే తెలుగు, ఇంగ్లిష్ కలిపి మాట్లాడే ‘టింగ్లిష్’ గుర్తురావట్లేదూ..!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు