ఐన్‌స్టీన్ పుట్టిన రోజే.. స్టీఫెన్ హాకింగ్ మృతి

స్టీఫెన్ హాకింగ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రఖ్యాత శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణించారు. ఆయన వయసు 76 ఏళ్లు.

కటుంబ సభ్యులు కొద్దిసేపటి కిందట ఈ విషయాన్ని తెలిపారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత అంతటి మౌలిక పరిశోధనలు చేసిన వ్యక్తిగా హాకింగ్‌కి పేరుంది.

ఐన్ స్టీన్ జయంతి రోజే స్టీఫెన్ హాకింగ్ మరణించడం యాధృచ్ఛికం.

ఫొటో సోర్స్, PA

ఖగోళ శాస్త్రవేత్తగా కృష్ణ బిలాలు('బ్లాక్‌హోల్స్‌)అనేక ఆవిష్కరణలు చేశారు.

'ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్' సహా, సైన్స్‌పై పలు పుస్తకాలు రాశారు.

ఈయన చాలా కాలంగా పలు అవయవాలు పనిచేయక చక్రాల కుర్చీకే పరిమితమైనా.. శాస్ర్త పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నారు.

భౌతిక శాస్ర్త రంగంలో ఈయన పలు సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, Getty Images

Factfile: స్టీఫెన్ హాకింగ్

జననం: 1942 జనవరి 8, ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో

చదువు: 1959లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో నేచురల్ సైన్స్ చదివారు. తర్వాత కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ చేశారు.

1963: మోటార్ న్యూరోన్ వ్యాధికి గురయ్యారు. కేవలం రెండేళ్లే బతుకుతారని చెప్పారు.

ఫొటో సోర్స్, Rex Features

1974: కృష్ణబిలాలపై అధ్యయనం చేశారు.

1988: ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు.

2014: హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)