విడాకుల దిశగా ట్రంప్ కోడలు.. కుమారుడు

  • 16 మార్చి 2018
జూనియర్ ట్రంప్, వెనీసా ట్రంప్ Image copyright Reuters
చిత్రం శీర్షిక జూనియర్ ట్రంప్, వెనీసా ట్రంప్. వీరికి 2005లో పెళ్లయింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది.

ఆ కథనాల ప్రకారం.. ట్రంప్ కోడలు వెనీసా ట్రంప్ న్యూయార్క్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు.

జూనియర్ ట్రంప్ ఈమెను 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అయిదుగురు పిల్లలున్నారు.

పెళ్లై 12 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని పేజ్ సిక్స్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ దంపతులు పేజ్ సిక్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో మేం మా ప్రైవసీ కోరుకుంటున్నాం.’’అని వెల్లడించినట్లు ఈ సైట్ తెలిపింది.

అంతకు మించి ఇతర వివరాలు వెల్లడించలేదని వివరించింది.

వీరు తాజాగా దరఖాస్తు చేసిన విడాకుల ప్రకారం.. పిల్లలు, ఆస్తులపై వివాదం ఉండదు.

ఈ ఏడాది మొదట్లోనూ ఈ దంపతుల వైవాహిక బంధంలో సమస్యలున్నాయని.. పేర్కొంటూ పలు కథనాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)