‘భాయ్! మీరు కూర్చున్నది అమ్మాయితో.. కాస్త వెనక్కు జరగండి!’
ఈమె పేరు రిఫత్ షెరాజ్. ఈవిడ.. పాకిస్తాన్‌లోని మొదటి మహిళా బైక్ కొరియర్!
రయ్.. మంటూ దూసుకుపోయే అబ్బాయిలను చూసి, తాను కూడా అలా బైక్ నడపాలని కలగన్నారు రిఫత్ షెరాజ్. తన 12 ఏళ్ల వయసులో బైక్ నేర్చుకుని తన కలను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం బైక్ నడపటమే ఈమె వృత్తిగా మారింది.
సాధారణంగా ఎక్కువ మంది పురుషులు బైక్ కొరియర్లుగా కనిపిస్తారు. కానీ ఈవిడ అరుదైన మహిళ. తరచూ మగవాళ్లను, అమ్మాయిలను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తారు రిఫత్ షెరాజ్.
వృత్తిలో భాగంగా.. పెద్ద వయసున్న మగవాళ్లను కూడా బైక్‌పై ఎక్కించుకోవాల్సిందే.. అలాంటపుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని, అపుడు వారితో..
‘‘భాయ్! మీరు కూర్చున్నది అమ్మాయితో.. కాస్త వెనక్కు జరగండి!’’ అని చెబుతారట.
ఎప్పటికైనా బైక్‌పై ప్రపంచాన్ని చుట్టేయాలంటున్న ఈ పాకిస్తానీ బైకర్‌తో మనమూ ప్రయాణిద్దాం రండి..
ఇవి కూడా చదవండి
- ఉగాది పంచాంగ శ్రవణం: ఎన్నికల ముందు జోస్యాలు ఎంత నిజమయ్యాయి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- భారత్‌ను ప్రశంసించిన పాకిస్తానీ యాంకర్
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)