ఎవరెస్ట్‌ను క్లీన్ చేస్తున్నారు!

  • 18 మార్చి 2018
నేపాల్ ఇప్పటికే 1200 కిలోల చెత్తను ఎవరెస్ట్‌పై నుంచి తరలించింది. మరో 100 టన్నులకుపైగా చెత్తను తరలించాల్సి ఉంది. Image copyright AFP
చిత్రం శీర్షిక నేపాల్ ఇప్పటికే 1200 కిలోల చెత్తను ఎవరెస్ట్‌పై నుంచి తరలించింది. మరో 100 టన్నులకుపైగా చెత్తను తరలించాల్సి ఉంది.

ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. దీనిపై ఇప్పుడు చాలా చెత్త పేరుకు పోయింది. ఎంతలా అంటే.. విమానాల్లో వెళ్లి శుభ్రం చేయాల్సినంత.

అవును మరి. ఇప్పటికే ఈ పర్వతాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు.

మొదటి రోజు 1200 చెత్తను సేకరించారు. మరో 100 టన్నులకు పైగా చెత్తను తొలగించాల్సి ఉంది.

పర్యటకులు, పర్వతారోహకుల వల్ల ఈ చెత్త పోగైనట్లు స్థానికులు తెలిపారు. తాజాగా తొలగించిన చెత్తను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు (రీసైక్లింగ్‌కి) తరలించారు.

ఈ చెత్తను లుక్లా విమానాశ్రయం నుంచి కఠ్మాండుకు విమానంలో తీసుకెళ్లారు. వాస్తవానికి పర్వతారోహకులు.. ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లిన వస్తువులు, చెత్తను వెనక్కు తెచ్చేయాలి.

కానీ అలా చేయడం లేదు. ఏటా స్థానిక గైడ్స్ కూడా వందల కిలోల చెత్తను శుభ్రం చేస్తున్నారు. అయినా అక్కడ పేరుకుపోతూనే ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇది 2010నాటి ఫొటో. ఎవరెస్టుపై చెత్త సేకరిస్తున్న ద‌‌ృశ్యం

ఈ ఏడాది ప్రత్యేకంగా శుభ్రతా చర్యలు చేపట్టారు. రీసైకిల్ చేయదగిన చెత్తను మాత్రమే సేకరిస్తున్నారు. చెత్త తరలింపునకు ఏటీ అనే ప్రయివేటు ఎయిర్ లైన్స్ సాయం అందిస్తోంది. ఈ ఏడాది అంతా చెత్తను తరలించనున్నారు.

ఇక్కడి చెత్తలో ఎక్కువ భాగం ఖాళీ బీర్ బాటిల్సే ఉన్నాయి. వీటితో పాటు ఆక్సిజెన్ బాటిళ్లు, ఆహార పదార్థాలు తెచ్చుకున్న డబ్బాలూ పెద్ద ఎత్తున ఉన్నాయి.

ఇక్కడ పరిశుభ్రతా పనులు స్థానిక గైడ్లు నిర్వహిస్తారు. వీరిని షెర్పాలుగా పిలుస్తారు. దశాబ్దాలుగా వీరు ఈ స్వచ్ఛ ఎవరెస్ట్ పనులు చేస్తున్నారు.

ప్రస్తుత పరిశుభ్రత పనులను సాగర్‌మాతా కాలుష్య నియంత్రణ సంఘం (ఎస్‌పీసీసీ) పర్యవేక్షిస్తోంది.

ఇలాంటివే మరికొన్ని

ఎస్పీసీసీ చెబుతున్నదాని ప్రకారం.. గత ఏడాది లక్ష మందికిపైగా పర్యాటకులు ఎవరెస్ట్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. వీరిలో 40 వేల మంది పర్వతారోహకులుంటారు.

వీరి కోసం గతంలో పలు శిబిరాల్లో ఎస్‌పీసీసీ చిన్నపాటి బయో టాయిలెట్‌లను కూడా నిర్మించింది.

ఇక్కడకు పర్వాతారోహకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో భద్రతాపరమైన ఆందోళన పెరిగింది.

దీంతో గతేడాది ఒక్కరే ఎవరెస్ట్‌ను ఎక్కడంపై నిషేధం విధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)