రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్!

  • 18 మార్చి 2018
Image copyright Getty Images

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ వ్లాదిమిర్ పుతినే ఎన్నికకానున్నారని ఇక్కడి ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

రష్యా అధికారిక ఎగ్జిట్ పోల్ పుతిన్‌కి 73.9శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో పుతిన్ గెలిస్తే మరో ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

అయితే.. కొందరు ఎన్నికల పరిశీలకులు మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విమర్శిస్తున్నారు.

2012లో పుతిన్‌కి 64 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి అది 73.9 శాతానికి పెరుగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

తొలి దఫా ఓట్ల లెక్కింపులో పుతిన్‌కి 72 శాతం మేర ఓట్లు వచ్చాయి. ఇప్పటికి మొత్తం పోలైన ఓట్లలో 21.3 శాతం ఓట్లను లెక్కించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు