రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు

  • 19 మార్చి 2018
వ్లాదిమిర్ పుతిన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక రష్యా ప్రధాని లేదా అధ్యక్షుడిగా దాదాపు 20 ఏళ్ల నుంచి పుతిన్ అధికారంలో ఉన్నారు

రష్యాకు వ్లాదిమిర్ పుతిన్ మరో ఆరేళ్లు నేతృత్వం వహించనున్నారు. ఊహించినట్లుగానే దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

దాదాపు అన్ని బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యిందని, పుతిన్‌కు 76 శాతం ఓట్లు లభించాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

పుతిన్‌పై పోటికి దిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.

‘‘గత కొన్నేళ్లుగా సాధించిన విజయాలను గుర్తించారు’’ అని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పుతిన్ అన్నారు. మాస్కోలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

మరో ఆరేళ్లు రష్యా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు కదా! అంటూ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బిగ్గరగా నవ్వేశారు.

‘‘మీరంటోంది హాస్యాస్పదంగా ఉంది. వందేళ్లపాటు నేను ఇక్కడే ఉంటానని మీరనుకుంటున్నారా? నో!’’ అని ఆయన అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక తన విజయం ఖరారైన తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి పుతిన్ మాట్లాడారు

‘ఈ మెజార్టీ పుతిన్‌కు అవసరం’

2012లో పుతిన్‌కు 64 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు అంతా ఊహించినట్లుగానే భారీగా పెరిగింది.

పుతిన్ సమీప ప్రత్యర్థి.. ధనవంతుడు, వామపక్ష నాయకుడు పావెల్ గ్రుడినిన్‌కు 12 శాతం ఓట్లు దక్కాయి.

అధ్యక్ష పదవికి పోటీపడిన రియాలిటీ టీవీ వ్యాఖ్యాతగా పనిచేసిన క్సెనియా సోబ్చాక్‌కు 2 శాతం, జాతీయవాది వ్లాదిమిర్ జిరినోవ్‌స్కీకు 6 శాతం ఓట్లు లభించాయి.

కాగా, పుతిన్‌ది ‘అత్యద్భుత విజయం’ అని ఆయన ప్రచార బృందం ప్రకటించింది.

‘‘ఈ మెజార్టీయే అన్నీ చెబుతోంది. భవిష్యత్ నిర్ణయాలకు అవసరమైన అధికారాన్ని ఇచ్చింది. పుతిన్ చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మెజార్టీ ఆయనకు అవసరం’’ అని ప్రచార బృంద అధికార ప్రతినిధి ఒకరు రష్యా ప్రైవేటు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్‌‌తో అన్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఓటర్లను ప్రలోభపెట్టారు. కజన్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఆహారం అందిస్తున్న దృశ్యం ఇది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పలు కార్యక్రమాలను నిర్వహించి, స్మార్ట్ ఫోన్లు, సైకిళ్లు మొదలైన బహుమతులు ఇచ్చారు

ఎన్నికల ‘చిత్రాలు’

కాగా, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల సమీపంలో ఉచితంగా భోజనం, స్థానిక దుకాణాల్లో రాయితీలు కల్పించారు.

రష్యా వ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లోని పోలింగ్ స్టేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయని వీడియోల్లో కనిపించింది. పలు వీడియోల్లో ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్లతో బాక్సుల్ని నింపుతున్న దృశ్యాలు కనిపించాయి.

పోలింగ్ రోజున వందలాది అక్రమాలు జరిగాయని స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ బృందం గోలోస్ తెలిపింది.

  • పోలింగ్ ప్రారంభం అయ్యేప్పటికే బ్యాలెట్ బాక్సుల్లో ఓటింగ్ పేపర్లు కనిపించాయి
  • కొన్ని పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశించకుండా పర్యవేక్షకుల్ని అడ్డుకున్నారు
  • బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో కొందరు ఓటర్లను బస్సుల్లోకి ఎక్కించారు
  • పోలింగ్ స్టేషన్లలోని వెబ్ కెమెరాలకు బెలూన్లు మొదలైనవి అడ్డు తగిలాయి

అయితే, కేంద్ర ఎన్నికల సంఘం అధిపతి ఎల్ల పంఫిలోవా మాట్లాడుతూ.. తీవ్రమైన ఉల్లంఘనలేమీ నమోదు కాలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్: పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత పౌరుడి కేసులో నేడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు... ఇప్పటివరకూ ఏం జరిగింది

బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా

ప్రెస్‌ రివ్యూ: ‘కాపులు బీసీలా.. ఓసీలా చంద్రబాబే చెప్పాలి’

ముంబయి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 10 మంది మృతి

ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్‌ల దారిలోనే వెళ్తున్నాడా

"ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" విశ్వభూషణ్ హరిచందన్

కేరళ వరదలు: ఈ వానాకాలాన్ని దాటేదెలా? గత ఏడాది విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుందా...

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది