శ్రీలంక: కోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!

  • 20 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!

శ్రీలంకలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో కండీ ఒకటి. పచ్చని ప్రకృతికి నిలయంగా పేరొందిన ఆ ప్రాంతాన్ని సందర్శించకుండా విదేశీ పర్యాటకులు వెనక్కి వెళ్లలేరు.

అయితే, ఇటీవల జరిగిన అల్లర్ల ప్రభావం కండీపై కూడా పడింది.

ఘర్షణల తర్వాత ఇక్కడ పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయిందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన తలత ఆలయం కండీలోనే ఉంది. ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఆ ఆలయం కూడా ఓ కారణం.

ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు.

దాంతో ఇప్పుడు మళ్లీ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వీడియో: జయకుమార్, మురళీధరన్ కాసి విశ్వనాథన్

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు