ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?

  • 23 మార్చి 2018
మెదడు ఊహాచిత్రం Image copyright iStock

‘మెదడులో నిరుపయోగంగా ఉన్న భాగాలను కూడా వాడుకుంటే మనం ఎంత ఇంటెలిజెంట్, క్రియేటివ్ అయిపోవచ్చో కదా' అని అనుకుంటున్నారా?

నేనూ అలాగే అనుకునేదాన్ని. మనం మెదడులో 10 శాతాన్ని మాత్రమే వాడుకుంటున్నామని. మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టి, వాడుకుంటే మరిన్ని తెలివితేటలతో, మరింత సృజనాత్మకంగా, విజయవంతంగా మారొచ్చుననే భావన ఎంత బావుంటుందో! కానీ, అది ఏమాత్రం నిజం కాదు.

అసలు మొదట ఒక ప్రశ్న వేసుకోవాలి.. పది శాతం ఏంటి? మెదడులోని పది శాతం ప్రాంతాన్ని మాత్రమే వాడుకుంటున్నాం అనేనా? ఒకవేళ అదే అయితే దీన్ని సులభంగా కొట్టిపారేయొచ్చు.

‘ఫంక్షనల్ మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్’ అనే సాంకేతిక పద్ధతిలో నాడీ సంబంధిత శాస్త్రవేత్తలు దీనికి సమాధానం చెప్పగలరు. ఈ పద్ధతిని ఉపయోగించి.. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనిషి మెదడులో ఏ భాగాలు స్పందిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

మీ పిడికిలి బిగించడం, నోటితో కొన్ని పదాలు పలకటం వంటి పనులకు మెదడులో పదో వంతు పనిచేస్తే సరిపోతుంది.

మీరు ఆలోచిస్తూ.. మరే పనీ చేయకపోయినప్పటికీ, మీ మెదడు మాత్రం.. శ్వాస తీసుకోవటం, గుండె కొట్టుకోవటం, తర్వాత ఏం చేయాలనే వాటిని గుర్తు చేసుకోవటం వంటి చాలా పని చేస్తుంటుంది.

10 శాతం అంటే మెదడులోని కణాల సంగతి అయ్యుండొచ్చు అంటారా! అది కూడా నిజం కాదు.

ఏదైనా నాడీకణం ఖాళీగా ఉంటే అది చచ్చుబడిపోవటం, చనిపోవటం లేదా సమీపంలోని సమూహంలో కలసిపోవటం సహజంగా జరిగే ప్రక్రియ.

మన మెదడులోని నాడీ కణాలు ఎప్పుడూ ఖాళీగా, పని లేకుండా అలా పడి ఉండవు. కానీ, అలా జరగడానికి మాత్రం ఆస్కారం ఉంది.

అసలు మన శక్తిని ఎక్కువగా వాడుకునేది మెదడే. మెదడు కణజాలాన్ని సజీవంగా ఉంచడానికి మనం పీల్చే గాలిలో 20 శాతం అవసరమవుతుందని అభిజ్ఞాన నాడీ శాస్త్రవేత్త సెర్గియో డెల్లా సల అంటారు.

Image copyright sorbetto/Getty

అలా అనుకోవడానికి కారణాలున్నాయి..

అయితే, 10 శాతం మెదడును మాత్రమే వాడుకుంటామని అపార్థం చేసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.

మన మెదడులో 90 శాతం కణాలు తెల్లగా ఉండే గ్లాల్ కణాలు. ఇవి భౌతికంగాను, పోషణ పరంగానూ మెదడుకు అండదండలిస్తాయి. మిగతా పది శాతం కణాలు.. న్యూరాన్లు బూడిదరంగులో ఉండే పదార్థం. మన ఆలోచనల సమాలోచనలు జరిగేది ఇక్కడే.

బహుశా అందువల్లనే కొందరు.. మన మెదడులో 10 శాతం మాత్రమే ఉపయోగంలో ఉంది, మిగతా 90 శాతాన్ని కూడా సానబెట్టాలి అని భావిస్తుండవచ్చు. కానీ, ఈ 90 శాతం కణాలు పూర్తిగా భిన్నమైనవి. అవి ఉన్నట్టుండి న్యూరాన్లుగా మారేందుకు, మనకు మరింత తెలివితేటలిచ్చేందుకు ఆస్కారం లేదు.

అయితే, ప్రపంచంలో కొందరు అరుదైన పేషెంట్లకు మాత్రం అసాధారణమైన మెదడు ఉన్నట్లు వాళ్లపై జరిపిన పరీక్షలను బట్టి తెలిసింది. తన పేషెంట్లలో కొందరికి హైడ్రోసెఫాల్స్.. అంటే అసలు మెదడు కణజాలం లేకపోవటాన్ని గుర్తించానని, అయినప్పటికీ వారి మెదడు పనిచేస్తోందని 1980లో జాన్ లోర్బెర్ అనే ఒక శిశువైద్యుడు ‘సైన్స్ జర్నల్’లో పేర్కొన్నారు.

అంత మాత్రాన సాధారణ మనుషులంతా కూడా మెదళ్లను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చని కాదు.

నాకు అంతుబట్టనిదేమంటే.. ఈ పది శాతం మెదడును మాత్రమే వాడుతున్నామనే విషయం నిజం కాదని చెబితే ప్రజలు నిరాశ చెందుతుంటారు. పది శాతం మాత్రమే వాడుకుంటున్నామనే భావన ఆకర్షణీయంగా ఉండటానికి కారణం.. మిగతా 90 శాతాన్ని కూడా వాడుకుని మెరుగుపడాలన్న సానుకూల ఆలోచన కావొచ్చు. మనం మరింత మెరుగ్గా ఉండాలని భావిస్తుంటాం.

ప్రయత్నిస్తే నిజంగానే మెరుగ్గా ఉండొచ్చు. కానీ, నిరుపయోగంగా ఉన్న మెదడును వాడుకుని మాత్రం కాదు. ఎందుకంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి.

మెదడుకు సంబంధించి మీకోసం మరిన్ని కథనాలు..

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబెంగళూరులో మనిషి మెదళ్లతో మ్యూజియం

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా

‘బాలకృష్ణ కోపంలో అలా అన్నారు కానీ..’ బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో నాగబాబు

ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే 100 ఏళ్లు బతికేసినట్లే

బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌ పేరుతో శరీరాల్లో చిప్స్‌ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా

భవిష్యత్తులో ప్రయాణాలు ఇలా ఉంటాయి

అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు

కరోనావైరస్: దిల్లీలో వైద్య వ్యవస్థ విఫలమైందా.. కేజ్రీవాల్ ప్రభుత్వం టెస్టుల్ని ఎందుకు తగ్గిస్తోంది

‘యోగా, సూర్య నమస్కారాలు క్రైస్తవానికి సరిపడవు.. ఒక క్రైస్తవుడి జీవితంలో యోగాకు స్థానం లేదు’ - గ్రీకు చర్చి

కరోనావైరస్: ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లగలరా